దేశవ్యాప్తంగా 70కి పైగా ఔషధ తయారీ
సంస్థల భాగస్వామ్యం రెండు రోజుల పాటు ప్రదర్శన
విజయవాడ, : ఔషధ తయారీదారులు, పంపిణీదారులు, వ్యాపారవేత్తలకు వేదికగా నిలుస్తున్న 17వ ఇండియన్ ఫార్మా ఫెయిర్ లబ్బీపేట ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. అక్టోబరు 23, 24 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనను ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ డైరెక్టర్ కె. అనిల్ కుమార్ ప్రారంభించారు. కృష్ణా జిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ ఫెయిర్‌లో దేశవ్యాప్తంగా 70కి పైగా ఔషధ తయారీ సంస్థలు పాల్గొంటున్నాయని నిర్వాహకులు బి.ఎన్. బండారి తెలిపారు . జనరిక్ మందులు, ఫార్ములేషన్స్, న్యూట్రాస్యూటికల్స్, కాస్మెటిక్స్, హెర్బల్, ఆయుర్వేద ఉ త్పత్తులు, వెటర్నరీ మందులు తదితరాలను ప్రదర్శిస్తున్నట్లు పేర్కొన్నారు. థర్డ్ పార్టీ తయారీ, కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్, పీసీడీ ఫ్రాంచైజీలు, లోన్ లైసెన్సింగ్, ఎగుమతులకు సంబంధించిన వ్యాపార అవకాశాలను కూడా ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచినట్లు తెలిపా రు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఫెయిర్‌కు సుమారు 6,000 నుంచి 8,000 మంది ఫార్మా రంగ నిపుణులు, డిస్ట్రిబ్యూటర్లు, మార్కెటింగ్ సంస్థల ప్రతినిధులు, ఎగుమతిదారులు, ఆసుపత్రులు కొనుగోలు విభాగాల ప్రతినిధులు, స్టాకిస్టులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు వివరించారు. ఔషధ తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను పరిచయం చేసుకోవడానికి, కొత్త వ్యాపార సంబంధాలను ఏర్పరచుకోవడానికి, మార్కెట్‌ను విస్తరించుకోవడానికి ఈ ఫెయిర్ దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు. కొత్త ఉత్పత్తులను తెలుసుకోవడంతో పాటు వ్యాపార ఒప్పందాలు కుదు-ర్చుకోవడానికి ఔషధ వ్యాపారులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలో ఫార్మా వాణిజ్యానికి విజయవాడను కీలక కేంద్రంగా అభివృద్ధి చేయడంలో ఇండియన్ ఫార్మా ఫెయిర్ ముఖ్యపాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు సి.సి. కేశవరావు, కార్యదర్శి వి. మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.