మంగళగిరి డబ్ల్యూపీఎల్ లీగ్ దశ పోటీలు హోరాహోరీ జరుగుతున్నాయి. మహిళా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూఏపీఎల్)లో అమరావతి ఈ ఛాంపియన్స్, గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్లు విజయాలు నమోదు చేశాయి. ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో అమరావతి ఈ ఛాంపియన్స్ జట్టు రాయలసీమ జెన్ స్టార్స్‌పై 7 పరుగుల తేడాతో విజయం సాధించి సీజన్లో రెండో విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచిన రాయలసీమ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా, అమరావతి 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. రంగ లక్ష్మి 44 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగులు చేయగా, అనూష 41 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 46 పరుగులు సాధించింది. కాట్రగడ్డ దీక్ష కేవలం 22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 46 పరుగులు చేసి జట్టు స్కోరును పెంచింది. ఆమెకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. 164 వరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయలసీమ జెన్ స్టార్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులకే పరిమితమైంది. గ్రీమ్మ 39, శుభశ్రీ 22 పరుగులు చేశారు. అమరావతి బౌలర్లలో సాయి పూజిత 4 వికెట్లు, కాండ్రేగుల దేవిక 2 వికెట్లు పడగొట్టారు.
గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్టు వైజాగ్ ఫైర్ బర్పై 10 పరుగుల తేడాతో విజయం సాధించి సీజన్లో తొలి గెలుపును నమోదు చేసింది. బాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన గోదావరి జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 134 పరుగులు చేసింది. కెప్టెన్ హేన్రిట్టా పెరీరా 46 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 61 పరుగులు చేసి జట్టుకు కీలక స్కోరు అందించింది. వైజాగ్ బౌలర్లలో రిషిక, తన్మయి చెరో 3 వికెట్లు తీశారు. 135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వైజాగ్ ఫైర్ బర్డ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 124 పరుగులు మాత్రమే చేసింది. ఆయేషా సింగ్, సరయు చెరో 34 పరుగులు చేశారు. గోదావరి బౌలర్లలో అక్షయ, విన్నీ క్రిష్టి వైష్ణవి తలో వికెట్ సాధించారు. జట్టును విజయానికి నడిపించిన హేన్రిట్టా పెరీరాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.