జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలి నదీ బేసిన్ల
సమన్వయ వ్యవస్థ ఏర్పాటు కాలపరిమితితో డీపీఆర్ లు,
అనుమతులు పరస్పర విశ్వాసం, సహకారం,
అభివృద్ధి 2047 నాటికి 10 ట్రిలియన్ డాలర్ల
ఆర్థికవ్యవస్థగా దక్షిణాది కుప్పం మీదుగా బుల్లెట్ రైలు
31వ దక్షిణాది ప్రాంతీయ మండలిలో సీఎం చంద్రబాబు
రాష్ట్రాల మధ్య ఉన్న సమస్య లను వరస్పర సహకారం, సమన్వయంతో పరిష్కరించు కోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాలు కలసికట్టుగా ముందుకు సాగితే భారతదేశ అభివృద్ధికి మరింత బలమైన చోదకశక్తిగా నిలుస్తాయని స్పష్టం చేశారు. 2047 నాటికి దక్షిణ భారత్ 10. ట్రిలియన్ డాలర్లకు పైగా ఆర్ధిక వ్యవస్థగా ఎదిగే సామర్థం ఉందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తమిళనాడులోని మహా బలిపురంలో గురువారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం లో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. 24 అంశా లతో కూడిన ఎజెండాపై సదూవేశంలో చర్చించారు. ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి గురించి ముఖ్య మంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం సాధించటమే లక్ష్యమని స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్రాల మధ్య విశ్వాసం, పరస్పర సహకారం తో సమస్యల పరిష్కారం జరగాలని సూచించారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ కుప్పం మీదుగా బుల్లెట్ రైలు కారిడార్న అభివృద్ధి చేయాలని సీఎం చంద్ర ప్రతిపాదించారు. అమరావతి-బెంగళూరు-చెన్నై నగ రాలను అనుసంధానించే ఈ మార్గం మూడు రాష్ట్రాల మధ్య ఆర్థిక కార్యకలాపాలకు మరింత ఊతం ఇస్తుందని వివరిం చారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్వర్క్ డ్రై పోర్టుల ఏర్పాటు, దక్షిణ గ్రిడ్‌ను జాతీయ విద్యుత్ గ్రిడ్‌తో అనుసంధానం చేయడం, యూనివర్సిటీలు, ఇతర స్కిల్లింగ్ సంస్థలతో కలిసి సంయుక్త నైపుణ్యాభివృద్ధి వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రకృతి విపత్తుల సమయంలో ఏ రాష్ట్రం ఒంటరిగా ఉండకుండా పరస్పర సహాయానికి ప్రత్యేక విపత్తు నిర్వహణ టాస్క్ పోర్సును ఏర్పాటు చేయాలని కేంద్రా నికి ప్రతిపాదించారు. తిరుపతి నుంచి అయోధ్య వరకుతీర్ధయాత్ర సర్క్యూట్... దక్షిణాది ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఉత్తర భారతదేశంలోని ఆధ్యాత్మిక కేంద్రాలతో అనుసంధా వ్య నిస్తూ ప్రత్యేక వారసత్వ, పర్యాటక, తీర్థ యాత్ర సర్క్యూట్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. తిరు పతి, శ్రీశైలం, కాంచీపురం, మధురై, రామేశ్వరం, మైసూరు వంటి ప్రాంతాలను వారణాసి, అయోధ్య, చార్ ధామ్ ప్రాంతాలతో అనుసంధానించడం ద్వారా దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రోత్సాహం కల్పించే అవకాశం ఉంటుందన్నారు. దేశ స్థూల ఉత్పత్తిలో దక్షిణాది ఐదు రాష్ట్రా ల వాటా ప్రస్తుతం 31 శాతంగా ఉందని తెలిపారు. 2017 నా నాటికి భారత్ 30 నుంచి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యానికి దక్షిణాది రాష్ట్రాలు ప్రధాన భూమికపోషిస్తాయని తెలిపారు. ఏపీ2.4 ట్రిలియన్ డాలర్లు తమిళ నాడు 2.6, కర్ణాటక 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలుగా లక్ష్యాలు నిర్దేశించుకున్నాయని సమష్టిగా దక్షిణ భారత్ లోని రాష్ట్రాలన్నీ 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థికశక్తిగా ఎదుగుతాయని సీఎం చంద్రబాబు వివరించారు.
నీటి భద్రతకు గోదావరి-కావేరి అనుసంధానం...
భవిష్యత్ నీటి భద్రతకు నదుల అనుసంధానమే శాశ్వత పరిష్కారమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి. పెన్నా వంటి 40 సదులు 28 జిల్లాలకు సాగునీటిని అందిస్తున్నాయని తెలిపారు. గోదావరి-కావేరి అనుసంధానంలో భాగంగా పోలవరం, కృష్ణా, పెన్నా మీదుగా 500 టీఎంసీలకు పైగా మిగులు వరద జలాలను కావేరి బేసిన్‌కు తరలించే ప్రతిపాదనను సీఎం చంద్రబాబు కేంద్రం ముందు ఉంచారు. ఈ ప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ప్రయో జనం కలిగిస్తుందని అన్నారు. గంగా- కావేరి అనుసంధా నాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని సూచించారు. గంగా నది మిగులు జలాలను దక్షిణాది ప్రాంతాలకు తరలించడం ద్వారా తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాల నీటి భద్రతకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాల మధ్య సమన్వయానికి ప్రత్యేక దక్షిణాది నదీ బేసిన్ల సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, డీపీఆర్ లు, అనుమతులను కాలపరిమితిలో పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరారు. కేంద్ర-రాష్ట్ర సంబంధాల్లో పరస్పర విశ్వాసం, రాష్ట్రాల మధ్య సహకారం, సమష్టి అభివృద్ధి ప్రధాన లక్ష్యాలు గా సదరన్ జోనల్ కౌన్సిల్ వనిచేయాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. కౌన్సిల్లో తీసుకున్న నిర్ణయాలు త్వరిత గతిన అమలు అయ్యేలా చూడాలని కోరారు. కౌన్సిల్లో సీఎం చంద్రబాబు చేసిన ప్రసంగాన్ని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రసంశించారు. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కేరళ సీఎం వి.డి. సతీషన్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె. కైలాష్ నాథన్, అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ డీరే. జోషి సహాఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
విభజన హామీల పరిష్కారం...
ఆంధ్రప్రదేశ్ పునర్విభజనకు సంబంధించిన పెండింగ్ అంశాలను సీఎం చంద్రబాబు సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు. రాష్ట్ర విభజన జరిగి 12 సంవత్సరాలు గడిచినా షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజన పూర్తికాలేదని తెలిపారు. ఆస్తులు, అప్పులు, సంస్థల విషయంలో సమ న్యాయం జరగాల్సిన అవసరం ఉ ందన్నారు. విభజన చట్టంలోని సెక్షన్ 66 కింద ఉన్న అంశాలపై కేంద్ర నిర్ణయం కోసం గడచిన 9 ఏళ్లుగా ఎదురుచూస్తున్నామని అన్నారు. విభజన చట్టంలోని సెక్షన్ 56లోని నమస్యలు, వనరుల లోటు, ఆర్ధిక భారానికి సంబంధించిన అంశాలను కూడా పరిష్కరించాలని కేంద్రాన్ని కోరారు. ఏపీ అభివృద్ధిలో కేంద్రం అందిస్తున్న సహకారానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. హామీ ఇచ్చిన 11 జాతీయ సంస్థల్లో 10 ఇప్పటికే ఏర్పాటు కావడం సంతోషదాయకమనిఅన్నారు. పోలవరం, సౌత్ కోస్ట్ రైల్వే జోన్, అమరావతి నిర్మాణంలో కేంద్ర సహకారం కీలకమన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్ అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అమ రావతి రాజధానికి చట్టబద్ధత కల్పించిన కేంద్రానికి ధన్య వాదాలు తెలిపారు. నీటి వనరులు, పచ్చదనం, జీవనప్రమా ణాలు, కనెక్టివిటీ, ఆర్ధిక అవకాశాలను దృష్టిలో ఉ ంచుకుని నూతన రాజధాని నిర్మాణం చేస్తున్నామని సీఎం చంద్ర బాబు వివరించారు. చట్టంలోని షెడ్యూల్-13 కింద ఉన్న ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇవ్వాలని సీఎం చంద్ర బాబు కోరారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్, మూడు విమానాశ్రయాల అభివృద్ధి, కొత్త రాజధానికి రైలు అనునంధానం వంటి పసులు వేగంగా పూర్తి చేయాలని కోరారు.
దుగరాజపట్నం పోర్టు, చీపీసీఎల్ రిఫైనరీ, విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులు, కడపలోని జిందాల్ స్టీల్ కు రైలు అనుసంధానంపై అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.