జన సైనికుల ఆత్మగౌరవమే ప్రాతిపదికగా పోటీ
ప్రాంతాలవారీగా రాజకీయ వ్యూహాల రూపకల్పన
పార్టీ శ్రేణులకు మెరుగైన రాజకీయ అవకాశాలు
శాసనసభాపక్ష సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్
జనసైనికులు, వీర మహిళల పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ తరపున అనుస రించాల్సిన విధివిధానాల రూపకల్పనకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రాంతాల వారీగా రాజకీయ, సామాజిక పరిస్థితులను బేరీజు వేసి జనసేన పోటీకి అనుకూలమైన స్థానాలను గుర్తించి కేంద్ర కార్యాల యానికి నివేదిక ఇవ్వాలని పార్టీ ఎమ్మెల్యేలను ఆదేశించారు. రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలోని ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో గురువారం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన శాసనసభ పక్ష సమావేశం జరిగింది. సుదీర్ఘంగా సాగిన సమావేశంలో మున్సివల్, పంచాయతీ రాజ్ సంస్థల ఎన్నికల కార్యాచరణపై చర్చించారు. ప్రజాప్రతినిధులు వెల్లడించిన అంశాలను నమోదు చేసుకున్నారు. ఎన్నికల సంసిద్ధతపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన స్థానిక ఎన్నికల్లో జనసేన శ్రేణులు ధైర్యంగా నిలిచిన తీరును జనసేనాని పవన్కౌ కళ్యాణ్‌ని యాడారు. నామినేషన్లు వేసే పరిస్థితులు లేకుండా అప్పటి పాలకులు వ్యవహరించినా వారిని ఎదిరించి పోటీకి నిలిచిన జనసేన నాయకులు, వీర మహిళల స్ఫూర్తిని ఎప్పటికీవిడిచిపెట్టబోమని స్పష్టం చేశారు. పార్టీ శ్రేణుల పోరాట పటిమ ఎంతో విలువైనదని పేర్కొన్నారు. పార్టీ పిలుపునిచ్చిన ప్రతి సంద ర్భంలో బలంగా నిలిచి ప్రజాపక్షాన పోరాడారని గుర్తుచేశారు.
సార్వత్రిక ఎన్నికల వ్యూహం వేరు
2019-2024 మధ్య రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 2021 స్థానిక ఎన్నికల్లో జనసేన శ్రేణులు ధైర్యంగా నిలిచాయని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయానికి దోహదపడ్డాయని డిప్యూటీ సీఎం అన్నారు. అప్పటి దాష్టీక పాలనను ముగించేందుకే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన 21 స్థానాలకు పరిమితమై పోటీ చేసిందని తెలిపారు. ఆ వ్యూహం సార్వత్రిక ఎన్నికలకే పరిమితనుని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో ప్రాం తాలవారీగా రాజకీయ, సామాజిక పరిస్థితులను అనుసరించి వ్యూహాలు రూపొం దిస్తామని చెప్పారు. అందుకు అనుగుణంగా స్థానిక ఎన్నికల్లో జనసేన ప్రభావశీలంగా, మెరుగైన స్థాయిలో నిలబడుతుందని తెలిపారు.
బలాబలాలపై నివేదికలు
పార్టీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకే పరిమితం కాకుండా ఆయా ప్రాం తాల్లో జనసేన బలాబలాలను అంచనా వేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు. పార్టీ పోటీకి తగిన స్థానాలను గుర్తించి కేంద్ర కార్యాలయానికి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ తరఫున అనునరించాల్సిన విధివిధానాలను రూపొందించేందు. ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయి శ్రేణుల ఆలోచనలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్తామని చెప్పారు. కమిటీలో ఎమ్మెల్యేలతోపాటు సీనియర్ నాయకులు సభ్యులుగా ఉంటారని, 9 నుంచి 11 మంది వరకు సభ్యులు ఉండే అవకాశం ఉందని తెలిపారు.
శ్రేణుల అభిప్రాయాలకు ప్రాధాన్యం
జనసేన ఎమ్మెల్యేలు లేని కొన్ని ప్రాంతాల్లో పార్టీ శ్రేణుల అభిప్రాయాలను ఎమ్మెల్యేలు సమావేశంలో వెల్లడించారు. కొందరు ఎమ్మెల్యేలు జనసేనకు తగిన ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ, మరికొన్ని ప్రాంతాల్లో కూటమి ధర్మానికి భిన్నంగా వ్యవహరిస్తుండటంతో శ్రేణుల్లో ఆసంతృప్తి ఉందని తెలుపుతూ ఆయా అంశాలు తన దృష్టికి వచ్చాయని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. పార్టీ శ్రేణుల అభిప్రా యాలను తప్పనిసరిగా ప్నపరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. రాజకీయంగా శ్రేణులను బలోపేతం చేసేలా ముందుకు వెళ్తామని, వారికి మెరుగైన అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనో 'హర్, కందుల దుర్గేష్, ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ నాగబాబు, రాజ్య సభసభ్యుడు లింగమనేని రమేష్, ప్రభుత్వ విప్‌లు బొమ్మిడి నాయకర్, బొలిశెట్టి శ్రీనివాస్, జనసేన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.