దోహా: అసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్లో భారత్ ఏకు షాక్ తగిలింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ఏ చేతిలో తిలక్ వర్మ కెప్టెన్సీలోని భారత జట్టు ఓడి నిరాశపరిచింది. అదివారం జరిగిన గ్రూప్ దీ పోరులో పాక్ 48 పరుగుల తేడాతో భారత్‌పై నెగ్గింది. పాక్ ఇచ్చిన 314 పరుగుల లక్ష్య ఛేదనలో భారత జట్టు 49.1 ఓవర్లలో 265 రన్స్ అలౌ టైంది. కెప్టెన్ తిలక్ వర్మ (100) సెంచరీకి తోడు ఓపెనర్ (42 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 70), షాబాజ్ అహ్మద్ (49 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లతో 56) మెరుపు అర్ధ శతకాలు చేసినా జట్టుకు ఓటమి తప్పలేదు. ఓపెనర్ సూర్యవంశీ (11), ఐదోనీ (0), కుశాగ్ర (2), రింకూ సింగ్ (6), సూర్యాంక్ (3) నిరాశపరిచారు. హసన్ నవాజ్, అలీ రెజా చెరో మూడు వికెట్లతో దెబ్బకొట్టారు. తొలుత పాక్ 49.2 ఓవర్లలో 313 పరుగులకు అలౌట్ అయింది. హసన్ నవాజ్ (79), మాజ్ సదాఖత్ (59), ఫర్హాన్ యూసఫ్ (56) అర్థ శతకాలతో రాణించారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, ప్రిన్స్, సూర్యాంశ్, విప్రజ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా, ఈ మ్యాచ్‌లో పారిస్థాన్ ఆటగాళు పలుమార్లు భారత ప్లేయర్లతో వాదనకు దిగారు. పాక్ బ్యాటింగ్ చేస్తుండగా హర్షిత్ రాణాతో షామిల్ హుస్సేన్ గొడవ పెట్టుకున్నాడు. భారత యువ ఓపెనర్ సూర్యవంశీ ఔటై మైదానం వీడుతున్న సమయంలో పాక్ ఫీల్డర్లు అతడిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఛేజింగ్‌లో హర్షిత్ ఔటైన తర్వాత కూడా పాక్ ఆటగాళ్లు నోటికి పని చెప్పగా.. భారత కెప్టెన్ తిలర్, అంపైర్లు వారిని వారించారు. మంగళవారం జరిగే తదుపరి మ్యాచ్‌లో యూఏఈతో భారత్ పోటీ పడనుంది.