చాలామంది ఏరు దాటాక తెప్ప తగలేస్తున్నారు. టాలీవుడ్లో అవకాశాలు అందుకుని తెలుగు ప్రజల ఆదరణ పొంది.. అటుపై బాలీవుడ్ కి వెళ్లాక తెలుగు దర్శకులు.. తెలుగు చిత్రపరిశ్రమపై నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు.. అయితే అందుకు భిన్నంగా తనకు అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేసిన పరిశ్రమను ఇప్పటికీ గుర్తు చేసుకుని మనసుల్ని హత్తుకునేవిధంగా మాట్లాడారు రకుల్ ప్రీత్ సింగ్. ఈ రోజు తాను ఈ స్థాయిలో ఉండటానికి పూర్తి క్రెడిట్ తెలుగు చిత్ర పరిశ్రమకే దక్కుతుందని రకుల్ ప్రీత్ సింగ్ తాజా ఇంటర్వ్యూలో అన్నారు. టాలీవుడ్ తనను తీర్చిదిద్దిందని.. పని విలువ నేర్పిందని.. స్టార్ డమ్ తో పాటు తాను కోరుకున్నదంతా ఇచ్చిందని గుర్తుచేసుకున్నారు. ఎదిగిన మూలాలను మర్చిపోకుండా ఇక్కడి పరిశ్రమ ఇచ్చిన ప్రోత్సాహాన్ని పదేపదే ప్రశంసించడంపై నెటిజన్లు, సినీ ప్రియులు ఫిదా అవుతున్నారు. తెలుగులో అగ్ర హీరోల సరసన వరుస విజయాలు అందుకున్న రకుల్.. ఆ తర్వాత బాలీవుడ్‌తో పాటు పాన్-ఇండియా స్థాయి ప్రాజెక్టులలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా రామాయణం- చిత్రంలో శూర్పణఖ పాత్రలో కనిపించి ప్రేక్షకులకు తన నటనలోని మరో కొత్త కోణాన్ని పరిచయం చేశారు. ఈ సినిమా తర్వాత రొటీన్ పాత్రలకు భిన్నంగా.. నటిగా తనకు సవాలు విసిరే స్క్రిఫ్ట్‌ల కోసమే ఎదురుచూస్తున్నట్లు రకుల్ వెల్లడించారు.