అనర్హులతో పేపర్లు దిద్దించిన ఘనత ఆనాటి వైసీపీది
ప్రైవేట్ ఏజెన్సీలకు పేపర్లు దిద్దే బాధ్యత అప్పగింత
ప్రొఫెసర్లు చేయాల్సిన పనిని కార్మికులకు అప్పగింత
అసెంబ్లీలో ఆనాటి దుర్మార్గాన్ని ఏకరువు పెట్టిన చంద్రబాబు
వైకాపా హయాంలో జరిగిన గ్రూప్-1 పరీక్షల్లో భయంకరమైన అక్రమాలు జరిగాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అభ్యర్థుల జీవితాలతో ఆటలాడుకున్నారని.. పేపర్లను పూర్తిగా అనర్హులతో దిద్దించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్-1 అక్రమాలపై శాసనసభలో జరిగిన చర్చలో సీఎం మాట్లాడారు. గ్రూప్-1 పై నివేదికలు చూస్తే భయంకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏపీపీఎస్సీ నియమాలు, నిబంధనలను పూర్తిగా ఉ ల్లంఘించారు. పేవర్లు దిద్దే బాధ్యతలను ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడమే తప్పు. ఏపీపీఎస్సీ చైర్మన్ ఆమోదం లేకుండా ఏ పనీ చేయకూడదు. పేపర్లు దిద్దడంలో ప్రతి దశలోనూ నిబంధనలు ఉల్లంఘించారు. యూనివర్సిటీ ప్రొఫెసర్లు చేయాల్సిన పనిని కార్మికులతో చేయించారు. ఈ మెయిల్, గూగుల్ డ్రైవ్, వాట్సప్‌లో వివరాలు షేర్ చేసుకున్నారు. ఇష్టానుసారంగా పేవర్లు దిద్దే అధికారం వీరికి ఎవరిచ్చారని నిలదీసారు. మార్కులు తగ్గించడం.. పెంచడం ఇష్టం వచ్చినట్లు చేశారు. సీఎం ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కు సెక్రటరీ పోస్టు ఇచ్చారు. ఏపీపీఎస్సీ చైర్మన్‌ను కట్టడి చేశారు. అభ్యర్థుల ప్రతిభ చూసి ఉద్యోగాలు ఇవ్వలేదు. వ్యవస్థలపై నమ్మకం కోల్పోయేలా ప్రవర్తించారు. తొలుత హైదరాబాద్‌లో, రెండోసారి హాయ్లాండ్లో పేపర్లు దిద్దించారు. హైదరాబాద్‌లో ఎవాల్యుయేషన్ చేసిన వారిలో 25 మంది అనర్హులు. హాయ్లాండ్లో ఎవాల్యుయేషన్ చేసిన 66 మందీ అనర్హులే. మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరగాలి.. డిజిటల్ మూల్యాంకనం వద్దని హైకోర్టు చెప్పింది. భవన నిర్మాణ కార్మికులు, డ్రైవర్లు, ప్లంబర్లతో పేవర్లు దిద్దించారని ఆనాటి అక్రమలాపై చంద్రబాబు ఏకరువు పెట్టారు. ఫ్రీ ఫ్రీలాన్సర్ మహంకాళి రఘురామ్‌ను నియమించారు. 166 మందిలో 50 మంది డిగ్రీ లెక్చరర్లను వినియోగించారు. గ్రూప్-1 జవాబు పత్రాల్లో ఫ్లూయిడ్‌తో తప్పులు దిద్దకూడదు. కానీ.. 55 చోట్ల తప్పులు సరిచేశారు. 49వేల డూప్లికేట్ ఓఎంఆర్ స్లిప్పులు ప్రింట్ చేశారు. గ్రూప్-1 పరీక్షలు రాసిన లెక్చరర్‌ను కూడా పేవర్లు దిద్దేందుకు పిలిచారు. కోర్టులను పక్కదారి పట్టించేందుకు అధికారులతో తప్పుడు అఫిడవిట్లు వేయించారు. ఖర్చుల కోసం రూ.1.14 కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు హైకోర్టు ఆదేశాలతో సిట్ ఏర్పాటైందన్నారు. వైకాపా హయాంలో గ్రూప్-1 నిర్వహణ అతిపెద్ద స్కామ్. . ఇలాంటి తప్పులు చేయాలంటే భయపడేలా శిక్షలు ఉ ండాలి. ఎవరైనా ప్రతిభకు పట్టం కట్టాలి.. పైరవీలకు దూరంగా ఉండాలి. ఇలాంటి తప్పులు ఎందుకు చేశారో సమాధానం చెప్పాల్సిందేని చంద్రబాబు అన్నారు. చేసింది సరైనదే అని చెప్పే దమ్ము, ధైర్యం వైకాపా నేతలకు ఉందా? ఇలాంటి అక్రమాలకు పాల్పడితే ప్రతిభావంతులు నష్టపోతారు. తప్పు చేసిన వారిని శిక్షించే బాధ్యత మనందరిదని సీఎం చంద్రబాబు అన్నారు. రాజ్యాంగం లోని ఆర్టికల్ 315 ప్రకారం ఏపీపీఎస్సీ ఏర్పడిందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర సర్వీసుల్లోకి వచ్చే అధికారులను గ్రూప్-1 పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారని, ఎంతో శ్రమించి అభ్యర్థులు ఉ ద్యోగాలు సాధిస్తారని చెప్పారు. అలాంటి పరీక్షల్లో గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ప్రజలు, ఉద్యోగార్థులు ఈ అంశాలను క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉ ందన్నారు. అసెంబ్లీ జవాబుదారీతనానికి వేదిక అని, ఇక్కడి నుంచే ప్రజలకు వాస్తవాలను వివరించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా ఏపీపీఎస్సీలో కట్టుదిట్టమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. 2019-24 మధ్య రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని తాను చాలాసార్లు చెప్పానని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వంలోని వివిధ వ్యవస్థలపై ప్రజల్లో విశ్వాసం వ్యవహరించారని పోయేలా గత పాలకులు విమర్శించారు.