ప్రేమలు'తో ఒక్కసారిగా యూత్ క్రష్ గా మారిన మమితా బైజు.. ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్గా మారింది. తన క్యూట్‌నెస్ కట్టిపడేసే ఈ మలయాళ ముద్దుగుమ్మ.. తాజాగా భారతీయ సినీ చరిత్రలోనే ఎవరూ సాధించని ఒక అరుదైన మైలురాయి చేరుకుంది. కేవలం 29 రోజుల వ్యవధిలో ఈ అమ్మడు నటించిన మూడు సినిమాలు వరుసగా రూ.200 కోట్లకుపైగా వసూలు చేసి.. హ్యాట్రిక్ కొట్టిన తొలి భారతీయ నటిగా చరిత్ర సృష్టించింది. ఎన్నో వాయిదాల తర్వాత జులై 23న వచ్చిన 'జననాయగన్' విజయాన్ని అందుకుంది. విజయ్ నటించిన చివరి చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉ ండడంతో బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇందులో మమిత.. విజ్జి పాత్రలో ఆకట్టుకుంది. సూర్య కథానాయకుడిగా విశ్వనాథ్ అండ్ సన్స్..: భారీ చిత్రం విడుదలైన కొద్దిరోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.240 కోట్ల గ్రాస్‌తో ఘన విజయం సాధించింది. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో మమిత నటన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అల్లరి చేసే పిల్లగా ఆకట్టుకున్న ఆమె.. అమ్మగానూ హృదయానికి హత్తుకునే నటనతో మెప్పించింది. బె+- లతెహోమ్ కుటుంబ యూనిట్..: నివిన్ పాలీతో కలిసి మమిత నటించిన ఈ మలయాళ చిత్రం ఆగస్టు 21న విడుదలై సంచలనం విజయం అందుకుంది. ఇప్పటికే రూ.200 కోట్ల మార్క్ దాటి రూ.250 కోట్ల దిశగా దూసుకుపోతోంది. దీన్నే తెలుగులో సెప్టెంబరు 4న విడుదల చేయనున్నారు.