కథానాయిక రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'మైసా' రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్నారు. తాజాగా చిత్రబృందం ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసింది. ఈ చిత్రాన్ని నవంబరు 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ రిలీజ్ డేట్ ప్రకటన సందర్భంగా మేకర్స్ పంచుకున్న క్యాప్షన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సహజంగానే ఆమె దృఢమైనది.. ఎంచుకున్న మార్గంలో భయం లేనిది.. చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం ఆమె సొంతం. మునుపెన్నడూ చూదని విధంగా 'మైసా' ప్రపంచంలో రష్మికను చూసేందుకు సిద్ధంగా ఉందండి అంటూ చిత్ర బృందం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. మునుపెన్నడూ లేని విధంగా రష్మిక ఈ సినిమాలో పూర్తిస్థాయి యాక్షన్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం 'రణబాలి. రష్మిక కథానాయిక. పెళ్లి తర్వాత వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రమిది. దసరా కానుకగా అక్టోబరు 16న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే చిత్ర బృందం స్పష్టం చేసింది.