రవితేజ నటించిన తాజా చిత్రం 'ఇరుముడి' బ్లాక్‌బస్టర్ హిట్‌గా రికార్డులు సృష్టిస్తోంది. తమిళంలో ఈ సినిమాకు విశేష ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా చెన్నైలో జరిగిన ఈవెంట్ రవితేజ మాట్లాడుతూ.. తన సినీ ప్రయాణం ఈ నగరంలోనే ప్రారంభమైందని తెలిపారు.. 'ఇరుముడి'కి జీవీ ప్రకాశ్ హృదయంతో సమానం, ఎడిట్ రూమ్‌లో బ్యాక్‌గా గ్రౌండ్ స్కోర్ (నేపథ్య సంగీతం) లేకుండా చూసినప్పుడే., ఇది విజయం సాధిస్తుందని అర్థమైంది.-లకైమాక్స్ చూసిన తర్వాత థియేటర్లలో మగవారితో పాటు చిన్న పిల్లలు కూడా భావోద్వేగానికి గురవుతున్నారు. ఆ దృశ్యాలు నిజంగా హృదయాన్ని హత్తుకుంటున్నాయి' అని రవితేజ అన్నారు. ప్రియా భవానీ శంకర్ గొప్ప నటి అని ప్రశంసించారు. ఈ సినిమా తెలుగులో విజయం సాధించినట్లే... తమిళంలోనూ కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇరుముడి' చిత్రానికి ఓవర్సీస్లోనూ మంచి స్పందన వస్తోంది. నార్త్ అమెరికాలో వన్ మిలియన్ డాలర్ల గ్రాస్ మారెన్స్ను చేరుకుని రికార్డు సృష్టించింది. ఈ క్లబ్లో చేరిన రవితేజ మొదటి చిత్రం ఇదే కావడం విశేషం. ఇక మూడు రోజుల్లోనే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.80 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.