నటుడు మహేశ్ బాబు రివ్యూ
లోకేశ్ కనగరాజ్, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'దీసీ' ఇటీవల విడుదలైన ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా స్టార్ హీరో మహేశ్ బాబు 'డీసీ' చిత్రానికి శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా తన రివ్యూ ఇచ్చారు. చాలా వినూత్నమైన, అద్భుతమైన చిత్రం. చాలా బాగుంది. ప్రతి అంశం నచ్చింది. ఈ సినిమా కోసం వర్క్ చేసిన వారందరికీ అభినందనలని పోస్ట్ పెట్టారు. ఈ పోస్టు దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ రీషేర్ చేస్తూ మహేశ్ కు కృతజ్ఞతలు తెలిపారు. 'మీ పోస్ట్ నిజంగా చాలా సంతోషాన్నిచ్చింది. మీరు డీసీని చూడటం, దీన్ని అభినందించడం చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది. మీ ప్రేమకు, కామెంట్స్‌కు ధన్యవాదాలు' అని రిప్లై ఇచ్చారు. దర్శకుడిగా తనదైన ముద్రవేసిన లోకేశ్ కనగరాజ్లో నటుడు కూడా ఉన్నారు. పలు చిత్రాల్లో ఆయన తళుక్కున మెరిశారు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రమే 'డీసీ'. ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. 'డీసీ' చూశాను. సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని తప్పకుండా చూడాలి. చిత్రబృందానికి అభినందనలు. దర్శకుడు. అరుణ్ మాథేశ్వరన్ చాలా గొప్పగా తీశారు. అనిరుధ్ నిజంగా అద్భుతం చేశారు. లోకేశ్ కనగరాజ్ హీరో పాత్రలో ఒదిగిపోయారని అల్లు అర్జున్ ప్రశంసించారు.