వివిధ కేటగిరీల్లో అత్యధిక పురస్కారాలతో
జిల్లాకు ప్రత్యేక గుర్తింపు స్వచ్ఛత, పారిశుద్ధ్య కార్యక్రమాల
అమలుకు దక్కిన గౌరవం ముఖ్యమంత్రి చేతుల మీదుగా
అధికారులతో కలిసి అవార్డులు అందుకున్న జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
విజయవాడ, : రాష్ట్రస్థాయి స్వచ్ఛాంధ్ర పురస్కారాల్లో ఎన్టీఆర్ జిల్లా సత్తా చాటింది. వివిధ విభాగాల్లో సమర్థవంతంగా చేపట్టిన స్వచ్ఛత, పారిశుద్ధ్య కార్యక్రమాలకు గుర్తింపుగా జిల్లాకు మొత్తం 8 రాష్ట్రస్థాయి పురస్కారాలు లభించాయి. నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి స్వచ్ఛాంధ్ర పురస్కారాల ప్రదానోత్సవంలో జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సంబంధిత శాఖల అధికారులతో కలిసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణ, ఘన వ్యర్థాల సమర్థ నిర్వహణ, ప్రజల్లో అవగాహన కల్పించడం, స్థానిక సంస్థల భాగస్వామ్యంతో పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం వంటి కార్యక్రమాలకు ఈ పురస్కారాలు గుర్తింపుగా నిలిచాయి. జిల్లా యంత్రాంగం, నగరపాలక సంస్థలు, గ్రామీణ స్థానిక సంస్థలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో చేపట్టిన చర్యలు ఈ విజయానికి దోహదవడ్డాయి. స్వచ్ఛ మున్సిపాలిటీ కేటగినీలో విజయవాద నగరపాలక సంస్థ, స్వచ్చ గ్రామ పంచాయతీ విభాగంలో మున్నలూరు గ్రామపంచాయతీ పురస్కారాలు సాధించాయి. స్వచ్ఛ ఆనువత్రులు కేటగిరీలో కొనకంచి ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి, ఇబ్రహీంపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవార్డులు పొందాయి. స్వచ్ఛ రైతు బజారు విభాగంలో పాయకాపురం రైతు బజారు, స్వచ్ఛత గ్రీన్ అంబాసిడర్ కేటగిరీలో మైలవరం గ్రామపంచాయతీకి చెందిన యు. సంధ్యకు పురస్కారాలు లభించాయి. స్వచ్ఛత ఎన్జీవో కేటగిరీలో సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్, స్వచ్ఛ ఆలయాల కేటగిరీలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం అవార్డులు అందుకున్నాయి. జిల్లాకు 8 పురస్కారాలు లభించడం పట్ల జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీక సంబంధిత శాఖల అధికారులు, సిబ్బందిని అభినందించారు. ఇదే స్పూర్తితో స్వచ్ఛత కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసి పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రజలకు అందించాలని సూచించారు.