సోషల్ మీడియా రీల్స్‌తో కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుని విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న బ్యూటీ ఇమాన్వి ఇస్మాయిల్ ఇప్పుడు మరోసారి ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా కేవలం తన అద్భుతమైన డాన్స్ మూవ్స్, క్యూట్ ఎక్స్ప్రెషన్తో నేషనల్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. తాజాగా షేర్ చేసిన ఫోటోషూట్ పిక్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ఆ లేటెస్ట్ లుక్ విశేషాలు ఇప్పుడు చూద్దాం.. ఇమాన్వి తాజాగా పోస్ట్ చేసిన ఫోటోల్లో తనదైన స్టైల్లో ఫ్యాషన్ ప్రియులను ఫిదా చేశారు. ఈ లేటెస్ట్ ఫొటోషూట్‌లో ఆమె బ్రైట్ ఆరెంజ్ కలర్ స్లీవ్స్ డ్రెస్‌లో మెరిసిపోయారు. స్క్వేర్ నెక్ లైన్ మరియు షేర్డ్ స్కర్ట్ ఉన్న ఈ డిజైనర్ డ్రెస్‌లో లో ఆమె ప్రిన్సెస్ లాగా అందంగా కనిపిస్తున్నారు. ఇక తన డ్రెస్‌కు మ్యాచింగ్‌గా తలలో పెట్టుకున్న వైట్ బో, చెపులకు గోల్డ్ హూప్ రింగ్స్ ఆమె అందాన్ని మరింత పెంచాయి. ఈ ట్రెండీ లుక్కు తగ్గట్టుగానే ఇమాన్వి జ్యువెల్లరీని చాలా సింపుల్‌గా మె-యింటైన్ చేశారు. మెడలో ఒక సన్నని లేయర్డ్ నెక్లెస్, చేతికి ఒక డెలికేట్ బ్రాస్లెట్, ఉంగరం ధరించి పర్ఫెక్ట్ లుక్‌ను క్రియేట్ చేశారు. జుట్టును పదులుగా విరుచుకుని, ముఖానికి సాఫ్ట్ అండ్ నాచురల్ మేకప్ తో ఆమె మరింత గ్లామరస్ గా కనిపిస్తున్నారు. ఇక ఈ ఫొటోల్లో ఆమె ఎక్స్ప్రెషన్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.