నవంబర్‌లో అమిత్.. డిసెంబర్లో ప్రధాని మోడీ పర్యటనలు
కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ సమరభేరి హైదరాబాద్‌లో
నవంబర్ 1న మహా పాదయాత్ర అన్ని జిల్లాల్లోనూ
నిరసన పాదయాత్రలు బీజేపీ ముఖ్యనేతల సమావేశంలో
కీలక నిర్ణయాలు గుంపు స్వామ్యాన్ని ఓడించి ప్రజాస్వామ్యాన్ని
రక్షించాలని బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు పిలుపు
హైదరాబాద్: పశ్చిమ బెంగాల్లో విజయం తర్వాత దీజేపీ అధిష్టానం తన దృష్టిని తెలంగాణపై కేంద్రీకరించినట్టు స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించను న్నారు. సుదీర్ఘకాలంగా వాయిదా పడుతూ వస్తున్న బీజేపీ అగ్రనేత, కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన దాదాపు ఖారారైంది. రాష్ట్రంలో బీజేపీ బలోపేతమే లక్ష్యంగా ఈ ఏడాది నవంబరులో అమిత్ షా పర్యటన కొనసాగనుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ బూత్ కమిటీ సమ్మేళనాల్లో షా పాల్గొన నున్నారు. కార్యకర్తలకు, స్థానిక నాయకులకు ఎన్నికలు, పార్టీ ఐలోపేతంపై దిశా నిర్దేశం చేయనున్నారు.
డిసెంబరులో ప్రధాని మోడీ పర్యటన...
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ టూర్‌కు కూడా ముహూర్తం కుదిరింది. డిసెం బర్లో ప్రధాని మోడీ రాష్ట్రానికి రానున్నారు. వరంగల్‌లో రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్, కాకతీయ మెగా టెక్స్టైట్రైల్స్ పార్ట్స్న జాతికి అంకితం చేయనున్నట్లు సమా చారం. ఈ సందర్భంగా వరంగల్ లో బీజేపీ భారీ బహిరంగ సభనిర్వహించనుంది. అగ్రనేతల పర్యటనలు ఖరారు కావడంతో నాయకుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
కాంగ్రెస్, కాక్రోచ్లలపై కాషాయ సమరం...
ఎస్అర్ వివాదంపై కాంగ్రెస్, కార్రోచతోపాటు విపక్షాల విమర్శలను తిప్పి కొట్టేందుకు బీజేపీ పర్కా వ్యూహం రచించింది. కేంద్ర పార్టీ నిర్దేశించిన కార్యక్రమాల అమలు, ఇటీవల హాట్ టాపిక్ గా మారిన ఎస్సీఆర్ అంశంపై విపక్షాలు చేస్తున్న అరా ‘పణలను తిప్పికొట్టేందుకు సమాయత్తమైంది. ఈ మేరకు గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన అత్యంత కీలకమైన ముఖ్యనేతల సన్నాహక సమావేశం ప్రారంభమైంది. ఎసర్ అంశంపై కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పక్షాలు కావాలనే బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తు న్నాయని, నిరసనలు, అరోపణల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని నేతలు నుండిపడ్డారు. ఈ దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు అనుసరించా ల్సిన కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు.
నవంబర్ 1న హైదరాబాద్‌లో మహా పాదయాత్ర...
ప్రజలకు వాస్తవాలను వివరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కనీసం 10వేల మందితో నిరసన పాదయాత్ర కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయిం చారు. ఇందులో భాగంగా వచ్చే నవంబర్ 1న హైదరాబాద్ వేదికగా ప్రతిష్టాత్మకంగా మహాపాదయాత్ర నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం ఖరారు చేసింది. రాష్ట్ర అధ్య క్షుడు రామచంద్రరావు నేతృత్వంలో ఈ పాదయాత్ర కొనసాగనుంది. సర్‌పై సుప్రీం కోర్టు తీర్పులు, వాస్తవ విషయాలను ప్రజల చెంతకు చేర్చాలని, విపక్షాల రాజకీయ కుట్రలను ఎండగట్టేందుకు మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఈ సమావేశం ద్వారా నిర్ణయించింది. సర్సై కాంగ్రెస్, కార్రోచ్ జనతా పార్టీలు చేస్తున్న రాద్దాంతాలకు వ్యతిరేకంగా బీజేపీ వివిధ కార్యక్రమాలు నిర్వ హించనుంది. హైదరాబాద్ నాంపల్లి ఓజేపీ కార్యాలయంలో త్వరలో చేపట్టనున్న లోక్ తంత్ర బచావో భీడితంత్ర హటావో ప్రచారకార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, గుంపు సామ్యాన్ని ఓడించండి అంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్‌రావు పిలుపునిచ్చారు. దేశంలో కాంగ్రెస్ కుట్రలను ఎండగట్టి... ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ కాంగ్రెస్ నాయకత్వం ప్రజల మనసులను, విశ్వాసాన్ని గెలుచుకోవడంలో విఫలమైందన్నారు. అధికార మార్చే లక్ష్యంగా అరాచకాలను ప్రోత్సహిస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తోందని అరోపించారు. కాంగ్రెస్ కుట్రలను ప్రజల ముందు ఎండగట్టేందుకు తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార ఉద్యమాన్ని చేపట్టను న్నామని తెలిపారు. దీనికి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, దీకే. అరుణ, కాండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రాకేష్రెడ్జి, పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీలు కొమరయు, అంజిరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కరీంనగర్లో పాల్గొనున్న స్మృతి ఇరానీ
ప్రజాస్వామ్య పరిరక్షణ, దేశ వ్యతిరేక శక్తులుగా తాము అభివర్ణిస్తున్న వారిని ఎదుర్కోవడమే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లనున్నట్లు టీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతర్రావు ప్రకటించారు. 'ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం... విద్రోహులను తరిమికొడ దాం' అనే నినాదంతో అన్నివర్గాల ప్రజలను కలుపుకాని ర్యాలీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.