పోలాండ్ ప్రధాని డోనాల్డ్ టస్క్ ప్రధాని మోడీ చర్చలు
రక్షణ, అంతరిక్షం, అణుశక్తి రంగాల్లో సహకారం బలోపేతం
2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయటమే లక్ష్యం
ఉగ్రవాదం పై ఉమ్మడి పోరు చేసేందుకు నిర్ణయం
కీలక ఖనిజాలు, సెమీకండక్టర్లలో భాగస్వామ్యానికి అంగీకారం
న్యూఢిల్లీ: భారత దేశం పర్యటనకు వచ్చిన పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ తో ప్రధాని నరేంద్ర మోడీ గురువారం న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ చర్చల సందర్భంగా ఇద్దరు నాయకులు ద్వైపాక్షిక సంబందాల పూర్తి పరిధిని సమీక్షించడంతో పాటు పరస్పర అసక్తి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా సంయుక్త పత్రికా సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ, ప్రపంచం అనిశ్చితి, పరివర్తన కాలం గుండా వెళ్తాందని, ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ భారతదేశం పోలాండ్ దేశాలు అభివృద్ధి, సాంకేతికత, అవిష్కరణలకు ముఖ్యమైన కేంద్రాలుగా ఆవిర్భవిస్తున్నా యని అన్నారు. రక్షణ, అంతరిక్షం, అణుశక్తి రంగాలలో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ఇరు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయని ఆయన తెలిపారు. ఈ వ్యూహాత్మక రంగాలన్నింటి లోనూ భారతదేశంతో కలిసి సహ అభివృద్ధి. సహ ఉత్పత్తిలో పాలుపంచు కోవాలని పోలాండ్ కంపెనీలను మోడీ అహ్వానించారు. అంతకుముందు, భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ వైశంకర్ పోలాండ్ ప్రధానమంత్రిటస్క్ తో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
2030 నాటికి వాణిజ్యం రెట్టింపు
ప్రపంచానికి విశ్వసనీయమైన సరఫరా వ్యవస్థలను అభివృద్ధి చేయడంతో పాటు 2030 నాటికి భారత్ పోలాండ్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రస్తుత స్థాయి నుంచి రెట్టింపు చేయాలని ఇరు దేశాల ప్రధానులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. కీలక, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలు, సైబర్ భద్రత, రక్షణ రంగంలో అవిష్కరణలకు వరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు.
కీలక ఖనిజాలు, బ్యాటరీల రీసైక్లింగ్‌పై దృష్టి
సర్క్యులర్ ఎకానమీ. వ్యర్థాల పునర్వినియోగ పరిశ్రమల్లో సహకారాన్ని పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ముఖ్యంగా బ్యాటరీల రీసైక్లింగ్, అరుదైన భూ మూలకాల శుద్ధి ప్రక్రియలకు ప్రాధాన్యం ఇవ్వనున్నాయి. భూగర్భ శా స్త్రం గనుల తవ్వకం, కీలక ఖనిజాల రంగాల్లోనూ సహకారాన్ని విస్తరించేందుకు అవకాశాలను గుర్తించాయి. ఈ రంగాలకు సంబంధించి పరస్పర కొనసాగుతున్నాయి. అవగాహన ఒప్పందంపై చర్చలు.
ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు
స్వేచ్చాయుత, బహిరంగ, శాంతియయత, తియత, సుసంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం కృషి చేయాలని ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. భారత్ పోలాండ్ వ్యూహాత్మక భాగస్వా మ్యం లో అంతరిక్ష రంగంలో ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమల మధ్య సంబంధాలను బలోపేతం చేయాలని నిర్ణయించారు. పరస్పర ప్రయోజనాలను అందించే నిర్దిష్ట సహకార అవకాశాలను గుర్తించే ప్రయత్నాలను స్వాగతించారు. అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్ని, హింసాత్మక తీవ్రవాదాన్ని ఇరు దేశాలు తీవ్రంగా ఖండించాయి. సరిహద్దుల అవతలి నుంచి జరిగే ఉగ్రవాద కార్యకలాపాలపైనా అందోళన వ్యక్తం చేశాయి. గత ఏడాది ఏప్రిల్‌లో జమ్మూకశ్మీర్‌లోని సహల్లామ్లో జరిగిన జగ్రదాడిని తీవ్రంగా ఖండించాయి. ఉగ్రవాదానికి నిధులు అందించే నెట్వర్క్ ను విచ్చిన్నం చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు."