సత్యం, అహింస, శాంతి మార్గాల్లోనే
దేశ ప్రగతి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, : జాతిపిత మహాత్మా గాంధీజీ ఆశయాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని గాంధీజీ విగ్రహానికి కలెక్టర్ ఎన్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, మున్సిపల్ కమిషనర్ ఎం. జయకృష్ణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. గాంధీజీ బోధించిన సత్యం, అహింస, శాంతి మార్గాలు ఎల్లప్పుడూ అనుసరణీయమని అన్నారు. దేశ స్వాతంత్య్ర సాధనతో పాటు దేశ పురోగతికి గాంధీజీ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టి సమాజ అభ్యున్నతికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన చూపిన నత్యం, అహింసా మార్గాలు సమాజానికి ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తాయని, గాంధీజీ స్ఫూర్తితో ప్రజలంతా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు జిల్లా, మున్సివల్ అధికారులు, సిబ్బంది పాల్గొని గాంధీజీకి నివాళులర్పించారు.