ఫారం-సి ద్వారా ఆన్లైన్ లో
వివరాలు తప్పనిసరి ఉల్లంఘిస్తే
రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు
జరిమానా, జైలు శిక్ష జిల్లాఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి, : జిల్లాలో విదేశీయులకు వసతి, ఆశ్రయం కల్పించే వ్యక్తులు, సంస్థలు వారి రాక, బస, నిష్క్రమణ వివరాలను తప్పనిసరిగా ఆన్లైన్లో సమోదు చేయాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం మాట్లాడుతూ.. విద్య, వైద్యం, పర్యాటకం, వ్యాపారం, ఉపాధి లేదా వ్యక్తిగత వనుల నిమిత్తం జిల్లాకు వచ్చే విదేశీయులకు వసతి కల్పించే ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలను పాటించాలని సూచించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారిసర్స్ యాక్ట్-2025 ప్రకారం ఈ వివరాల నమోదు తప్పనిసరని పేర్కొన్నారు. హోటళ్లు, రిసార్టులు, లాడ్జీలు, అతిథి గృహాలు, హోమ్ స్టైలు, సర్వీస్ అపార్ట్మెంట్లు, ప్రైవేటు అద్దె ఇళ్లు, పేయింగ్ గెస్ట్ వనతులు, ఆనుపత్రులు, వైద్య కేంద్రాలు, విద్యాసంస్థలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, పాఠశాలల వనతి గృహాలు, మఠాలు, ఆశ్రమాలు, మదర్భాలు, కాన్వెంట్లు తదితర ప్రాంతాల్లో విదేశీయులకు బస కల్పించే వారందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని ఎస్పీ తెలిపారు. విదేశీయుడు వసతి కేంద్రానికి చేరుకున్న సమయం నుంచి 24 గంటల్లోగా ఫారం-సి ద్వారా ఆన్లైన్లో వివరాలను నమోదు చేయాలి. అతిథి వెళ్లిపోయిన సమయంలో కూడా నిష్క్రమణ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. సంబంధిత యాజమాన్యాలు అతిథుల రికార్డులను కనీసం ఏడాది పాటు భద్రపరచాలని సూచించారు. విదేశీయులతో పాటు ఓసీఐ కార్డుదారులు, నేపాల్, భూటాన్ దేశస్థులు బస చేసినా వారి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. విదేశీయుల బన వివరాలను నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించే వ్యక్తులు, ప్రైవేటు లేదా వాణిజ్యేతర పనతుల నిర్వాహకులపై కనీసం రూ.50 వేల జరిమానాతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశం ఉందన్నారు. అలాగే హోటళ్లు, ఆనువత్రులు, విద్యాసంస్థలు వంటి వసతి కల్పించే సంస్థల నిర్వాహకులపై కనీసం రూ. లక్ష జరిమానాతో పాటు క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. చెల్లుబాటు అయ్యే వీసా లేదా పాస్పోర్టు లేకుండా విదేశీయులకు ఆశ్రయం కల్పించడం, నకిలీ పత్రాల వ్యవహారాలకు సహకరించడం వంటి తీవ్రమైన ఉల్లంఘనలకు 2 నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. దీనికి అదనంగా రూ. లక్ష నుంచి రూ.10 లక్షల వరకు జరిమానా కూడా విధించవచ్చు. నిబంధనల ఉల్లంఘనను తేలికగా తీసుకోవద్దని ఎస్పీ హెచ్చరించారు. ఫారం-సి నమోదు కోసం బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అధికారిక పోర్టల్లో వసతి కల్పించే యాజమాన్యాలు ముందుగా నమోదు చేసుకోవాలి. వినియోగదారు పేరు, సంకేతవదం, చిరునామా, ఆతిథ్యదాత వివరాలు తదితర సమాచారాన్ని అందించాలి. అవసరమైన పత్రాలను సమర్పించి అనుమతులు పొందిన అనంతరం లభించే లాగిన్ వివరాలతో విదేశీయుల బసకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయవచ్చునని తెలిపారు.
విదేశీయులు కూడా భారత చట్టాలను గౌరవించాలని, వీసా గడువు ముగిసిన తర్వాత దేశంలో ఉండకూడదని, అనుమతులు లేకుండా వ్యాపారం లేదా ఉద్యోగం చేయరాదని ఎస్సీ సూచించారు. చిరునామా మారిన సందర్భంలో సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. ఓసీఐ కార్డుదారులు కూడా తమకు వర్తించే నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. జాతీయ భద్రత దృష్ట్యా తమ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా విదేశీయులు నివసిస్తున్నట్లు గుర్తిస్తే ప్రజలు వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్ 112కు సమాచారం ఇవ్వాలని ఎస్సీ కోరారు. అవసరమైన సమాచారం కోసం హైదరాబాద్లోని విదేశీయుల ప్రాంతీయ నమోదు కార్యాలయాన్ని సంప్రదించవచ్చని తెలిపారు.