పంపిణీ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు,
పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట ఏర్పాట్లు చేయాలి
ఓటర్లు, ఎన్నికల సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు
కలగకుండా చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్,
జిల్లా ఎన్నికల అధికారి ఎం. అభిషిక్త్ కిశోర్
విశాఖపట్నం, : జీవీఎంసీ రెండో సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సామగ్రి. పంపిణీ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు, పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లన్నింటినీ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం. అభిషిక్త్ రిశోర్ అధికారులను అదేశించారు. గురువారం ఆయన జీవీఎంసీ అదనపు కమిషనర్ కె. రమేష్, సంబంధిత జోనల్ కమిషనర్లు, జోనల్ ప్రత్యేక అధికారులు, ఇతర అధికారులతో కలిసి నార్త్ జోన్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం, స్ట్రాంగ్ రూములు, జ్ఞాన నికేతన్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం గాజువాక జోన్‌లోని బీహెచ్ఎల్ టౌన్షిప్, గాజువాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను సమీక్షించారు. ప్రభుత్వ పాలిటెక్నిర్ కళాశాలలోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్, రిసెప్షన్ కేంద్రం, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, అహార ఏర్పాట్లను పర్కా ప్రణాళికతో చేపట్టాలని సూచించారు. స్టాట్యూటరీ, నాన్స్టాట్యూటరీ గదులు, స్ట్రాంగ్ రూములు, మూడు వార్డులకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రిసైడింగ్ అధికారులు (పీఓలు), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (ఏపీఓలు), ఇతర పోలింగ్ సిబ్బందికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం నుంచి సంబంధిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది సజావుగా చేరుకునేలా రవాణా, మార్గదర్శక ఏర్పాట్లు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల వివరాలు ఓటర్లకు అర్థమయ్యేలా స్పష్టమైన సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. జ్ఞాన నికేతన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, అక్కడ స్థలాభావం ఉన్నందున ఓటర్ల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఓటర్లు సులభంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సంబంధిత జోనల్ కమిషనర్ బి. రామును ఆదేశించారు. పాఠశాల ప్రాంగణంలో పేరుకుపోయిన నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను (సీ అండ్ డీ వేస్ట్) వెంటనే తొలగించాలని అదనపు కమిషనర్ రమేష్‌కు సూచించారు. అనంతరం, గాజువాక జోన్‌లోని బీహెచ్ఎల్ టౌన్షిప్ ప్రాంగణం, గాజువాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించి, సంబంధిత సెక్టార్ అధికారులను ఏర్పాట్ల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేసి ఉ ండాలని, కొన్ని చోట్ల పనులు ఇంకా అశించిన స్థాయిలో లేవని పేర్కొన్నారు. పెండింగ్ పనులను తక్షణమే పూర్తి చేసి, ఎన్నికల నిర్వహణడు అవసరమైన అన్ని ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని ఆదేశించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద విధుల్లో ఉన్న పోలీసు సక్ఇన్స్పెక్టర్లతో కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియపై, తమ విధులు, బాధ్యతలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, పోలీసు సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎన్నికల సామగ్రి పంపిణీ సమయంలో, పోలింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేదా ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా పటిష్టమైన కార్యాచరణతో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. పర్యటనలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జ్ఞానవేణి, పర్యవేక్షక ఇంజనీర్లు సంపత్ కుమార్, రాయల్ బాబు, పద్మావతి, ఏసీపీ తిరుపతిరావు, సంబంధిత జోనల్ అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.