విభజన శక్తులకు వ్యతిరేకంగా ఏకమవ్వాలి
సవాళ్లను ఎదుర్కొనేందుకు మరింత చురుగ్గా ఉండాలి
యువత భాగస్వామ్యంతో బలమైన భారత్‌ను నిర్మించాలి
'చిన్మయ మిషన్' సమ్మేళనంలో ప్రధాని మోదీ పిలుపు
న్యూఢిల్లీ : విభజన శక్తులకు వ్యతిరే కంగా సమాజం అంతా ఒక్క టవ్వాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రజల్లో స్వావలంబనపై అవగాహన పెంచడంతోపాటు దేశంలోని ప్రతి ఒక్కరినీ 2047 నాటికి వికసిత భారత్ నిర్మాణ లక్ష్యంతో అనుసంధానించా లని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా దేశం కొత్త సవాళ్లను ఎదుర్కొం టోందని, సమాజంలో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించే బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన చిన్మయ మిషన్ అమృత మహోత్సవ అంతర్జాతీయ సమ్మేళనం ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. చిన్మయ మిషన్ సేవలను ప్రధాని ప్రశంసించారు. స్వామి చిన్మయా నంద ప్రారంభించిన అధ్యాత్మిక ఉద్యమం ద్వారా లక్షలాది మంది యువత భారతీయ సంస్కృతికి ప్రతినిధులుగా నిలుస్తున్నారని చెప్పారు. చిన్మయా నందతో తనకున్న అనుబంధాన్ని మోదీ ఈ సంద ర్భంగా గుర్తుచేసుకున్నారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యానికి తన పాలనలోనూ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. చిన్నయ మిషన్ అమృత మహోత్సవంలో భాగంగా యువ వలంటీర్లు 300 రోజుల వ్యవధిలో 40 వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించి లక్ష మందికి పైగా యువతను కలు సుకోవడాన్ని మోదీ అభినందించారు. భారతీయ తాత్విక సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రస్తావిస్తూ ఉపనిషత్తుల్లోని 'వయం అమృతస్య పుత్రః అనే వాక్యాన్ని మోదీ ఉటండించారు. మనం అమృతత్వానికి వారసులమనే భావన భారతీయ జ్ఞాన సంపదకు, అధ్యాత్మిక చైతన్యానికి ప్రతీక అని వివరించారు. వేల సంవత్సరాలుగా భారత్ జ్ఞాన అన్వేషణ, అధ్యాత్మిక వికాసం దిశగా సాగుతోందని చెప్పారు. దేశ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండా లని పిలుపునిచ్చారు. దేశం పట్ల బాధ్యతగా వ్యవహరిం చడం. జాతీయ ప్రగతికి తోడ్స దడం ప్రతి పౌరుడి కర్తవ్య మని తెలిపారు. దేశ సాంస్కృ తిక ప్రదేశాలకు అంతర్జాతీయ గుర్తింపు లటిస్తుం డడం సంతోషకరమని, గత 12ఏళ్లలో 650కు పైగా ప్రాచీన విగ్రహాలను విదేశాల నుంచి భారత్‌కు తిరిగి తీసుకొచ్చినట్లు మోదీ ఈ సందర్భంగా తెల్లి పారు.
సవాళ్లు మారుతున్నాయి
కాలానుగుణంగా సవాళ్లు మారుతున్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు సంస్థలు, ప్రజలు మరింత చురుగ్గా వ్యవహరించాలని ప్రధాని మోదీ పిలుపుని చ్చారు. ఒక్కో సంస్థకు ఒక్కో లక్ష్యం ఉన్నప్పటికీ, అంతిమంగా దేశాభివృద్ధి. జాతీయ గౌరవం అనే ఉమ్మడి గమ్యమే అందరినీ నడిపించాలని అన్నారు. విభజన శక్తులకు వ్యతిరేకంగా సమాజాన్ని ఏకం చేయడం, పౌరులను స్వావలంబన దిశగా ప్రేరేపించడం. ప్రతి ఒక్కరినీ విరసిత భారత్ సంకల్పంలో భాగస్వాములను చేయడం తక్షణ కర్తవ్యాలని స్పష్టం చేశారు. 1961లో చిన్మయానంద స్థాపించిన చిన్నాయ మిషన్ 76 ఏళ్ల ప్రస్థానానికి ముగింపుగా నిర్వహిస్తున్న ఈ 3 రోజుల అంతర్జాతీయ సమ్మేళ నంలో 9 వేల మందికి పైగా పాల్గొంటున్నారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం.. అరాచకాన్ని తరిమేద్దాం
ఓటర్లలో చైతన్యానికి బీజేపీ ప్రచార భేరీ!
ఎస్ఐఆర్పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు బీజేపీ శ్రీకారం చుట్టింది. 'ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం.. అరాచకాన్ని తరిమేద్దాం' పేరుతో దేశవ్యాప్తంగా రెండు విడతల్లో ఈ భారీ ప్రచార కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పార్టీ వెల్లడించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నటీన్ మార్గదర్శకత్వంలో శుక్రవారం ప్రారంభమైన మొదటి విడత ప్రచారం నవంబరు 5 వరకు కొనసాగనుంది. రెండో విడత కార్యక్రమాలు నవంబరు 11నుంచి 30వరకు నిర్వహించనున్నారు. ఎన్ఐఆర్పై విపక్షాల అరోపణలను తిప్పికొట్టడమే లక్ష్యంగా ఈ ప్రజా చైతన్య ఉద్యమాన్ని చేపట్టినట్లు దీజేపీ స్పష్టం చేసింది. ప్రచారంలో భాగంగా ప్రతి జిల్లా కేంద్రంలో కనీసం 10వేల మందితో పాదయాత్రలు చేపట్టనున్నారు.