న్యూఢిల్లీ: యెమెన్ అంతర్యుద్ధం రోజురోజుకూ సిద్ధృతమవుతోంది. సౌదీ అరేబియా, ఇరాన్ మద్దతున్న హౌతీ రెబల్స్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జులైలో ముగియడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. హౌతీలపై భారీ సైనిక చర్యకు యెమెన్ ప్రభుత్వం సిద్ధమవుతుండగా.. మరోవైపు హౌతీలు కీలక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. తాజాగా కీలకమైన తుర్బా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. యెమెన్ ప్రభుత్వానికి మద్దతుగా సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు హౌతీల స్థావరాలపై దాడులు చేస్తున్నాయి. మరోవైపు దేశంలోని మూడో అతిపెద్ద నగరమైన తైజ్లోకి చొచ్చుకెళ్లేందుకు హౌతీలు ప్రయత్నిస్తున్నారు. ఏడెన్--రైళ్లను కలిపే కీలక రహదారిపై తుర్భా ఉండటంతో దీనికి వ్యూహాత్మక ప్రాధాన్యం ఉంది. తైజ్ను రక్షించే ప్రభుత్వ బలగాలకు ఇది కీలక స్థావరంగా ఉంది. గత నెల ఎర్ర సముద్రంలోని పోర్టు సిటీ మోఖా, బాబ్ ఎల్ మండెజ్ జలసంధిపై హౌతీలు పట్టు సాధించారు. దీనికి ప్రతిగా హౌతీల ఆధీనంలోని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా 'డాన్ ఆఫ్ యెమెన్' పేరిట యెమెన్ ప్రభుత్వం భారీ సైనిక చర్య చేపట్టింది. బాబ్ ఎల్ మండెబ్ జలసంధిపై పైచేయి సాధించామని ప్రకటించిన ప్రభుత్వం.. తీరప్రాంత పట్టణం ధుబాబ్, నమీపవిమానాశ్రయాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. భారీ నిరసనల నేపథ్యంలో మూడు దశాబ్దాలకు పైగా సాగిన అలీ అబ్దుల్లా నలేహ్ పాలన 2012లో ముగిసింది. 1978 నుంచి 1990 వరకు ఉత్తర యెమెన్ అధ్యక్షుడిగా, ఆ తర్వాత ఉమ్మడి యెమెన్ తొలి అధ్యక్షుడిగా ఆయన కొనసాగారు. ఉత్తర, దక్షిణ యెమెన్ల విలీనంలో కీలక పాత్ర పోషించారు. 1994లో దక్షిణ వేర్పాటువాదుల తిరుగుబాటును అణచివేసి తన అధికారాన్ని మరింత బలపరుచుకున్నారు. 2004--2010 మధ్య హౌతీ తిరుగుబాటుదారులపై వరుస సైనిక చర్యలు చేపట్టారు. అయితే 2011లో 'అరబ్ స్ప్రింగ్' ఉద్యమంతో సలేహ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు చెలరేగాయి. దీంతో 2012లో ఉపాధ్యక్షుడు అబ్దుల్ మన్సూర్ హాదీకి అధికారాన్ని బదిలీ చేసి నలేహ్ తప్పుకున్నారు. రాజకీయ అస్థిరతను ఆసరాగా చేసుకున్న ఇరాన్ మద్దతున్న హౌతీలు 2014-15లో నలేమ్ వ్యూహాత్మక పొత్తు పెట్టుకున్నారు. ఈ కూటమి సనా నగరాన్ని స్వాధీనం చేసుకుని హాడీ ప్రభుత్వాన్ని గద్దె దించింది. అనంతరం హౌతీలతో సలేహ్ విభేదించి సౌదీ అరేబియాతో ఒప్పందం చేసుకున్నారు. హొతీలను అడ్డుకునేందుకు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు 2015 మార్చిలో వైమానిక, భూతల దాడులు ప్రారంభించాయి. దీంతో ఆగ్రహించిన హౌతీలు 2017లో సనాలోని నలేహ్ ఇంటిని చుట్టుముట్టి హతమార్చారు.
3.77 లక్షల మందికి పైగా మృతి
యెమెన్లో కొనసాగుతున్న యుద్ధం, వ్యాధులు, ఆకలి కారణంగా 3,77,000 మందికి పైగా మరణించారు. మరో 45 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఆరోగ్య సదు-పాయాలు ధ్వంసం కావడంతో కలరా వంటి వ్యాధులు విస్తరించాయి. పోషకాహార లోపం కూడా తీవ్రంగా ఉంది. దేశ జనాభాలో 80 శాతానికి పైగా ప్రజలు మానవతా నహాయంపై ఆధారపడి జీవిస్తున్న పరిస్థితి నెలకొంది.