టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అంటెసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ 'ది ప్యారడైజ్ సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు.ఈ సినిమాలోని రెండో సింగిల్ డిజిటల్ లాంచు రంగం సిద్ధమైంది. 'యెష నాగుల' అంటూ సాగే ఈ పాటను శనివారం అధికారికంగా విడుదల చేయనుండగా.. దానికి ముందుగా ఈరోజు సాయంత్రం ఈ సాంగ్‌ను అనిరుధ్ కన్సర్ట్లలో పాడబోతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ పాటకు శ్యామ్ లిరిక్స్ అందించగా.. జంగి రెడ్డి, సందీప్ కుమార్ ఆలపించారు. అలాగే సందీప్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేయడం విశేషం. ఇదిలా ఉంటే, ఈ చిత్రంలో మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలీ కులకర్ణి, సంపూర్ణేష్ బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బ్లడెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 24, 2026న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ఖరారు చేశారు.