మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర గణేశ్
నర్సీపట్నం, : మండల పరిధిలోని పెదబొడ్డవల్లి లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ ప్రాంతానికి చెందిన వైసీపీ క్యాడర్‌కు ఐడీ కార్డులను మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర గణేశ్ పార్టీ నాయకులకు అందజేశా రు. ఈ సందర్భంగా గణేశ్ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సమర్థవంతమైన అభ్యర్థులను బరిలో దించి, వారి విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలుసమష్టిగా కృషి చేయాలని సూచించారు. కూటమిపార్టీ ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నాయకుల కు పిలుపునిచ్చారు. ఈ నెల 18వ తేదీన గొలుగొండ మండలం పాకలపాడు గ్రామంలో నర్సీపట్నం నియోజ కవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే రోజు ఉదయం 9.30 గంటలకు పాకలపాడు గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వ హించనున్నట్లు వెల్లడించారు. విగ్రహావిష్కరణ అనంతరం, నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి రీజనల్ కో-ఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ పాటు మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పరిశీలకులు, జిల్లా స్థాయి నాయకులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పెట్ల ఉ మాశంకర గణేశ్ కోరారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు ఏక శివప్రసాద్, నుర్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.