శ్రీకాళహస్తిలో రౌడీయిజానికి తావులేదు
స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ నాయకులపై
దాడులను ఖండించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
శ్రీకాళహస్తి, నంబర్ వన్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వుంగనూరు, రాయచోటి, తిరుపతి తదితర ప్రాంతాల్లో టీడీపీ నాయకులు, అభ్యర్థులపై జరుగుతున్న దాడులను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్‌రెరెడ్డి తీవ్రంగా బండించారు. ఓటమి భయంతోనే వైఎస్సార్సీపీ నాయకులు హింస, దాడులకు పాల్పడుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తాడేపల్లి నుంచి అందుతున్న ఆదేశాలతోనే వైసీపీ శ్రేణులు అల్లర్లకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఇతర ప్రాంతాల నుంచి రౌడీ మూకలను తీసుకొచ్చి దాడులు చేయడం, వివక్ష అభ్యర్ధులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, నామినేషన్ పత్రాలను చించివేయడం, అధికారులను బెదిరించి ఏకగ్రీవాలకు ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. నామినేషన్ల స్వీకరణ నుంచి పోలింగ్ వరకు ప్రతి దశలో అభ్యర్ధుల హక్కులను కాపాడాలని, దాడులకు పాల్పడే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో జరిగిన హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా ఎన్నికల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను ఎదుర్కోవడమే తమ విధానమని, ప్రజల తీర్పును గౌరవించాలని పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలో రౌడీయిజానికి, బెదిరింపులకు, హింసాత్మక రాజకీయాలకు తావులేదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిని ఉ పేక్షించబోమని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి స్పష్టం చేశారు.