27 మందితో తొలి జాబితా విడుదల
విశాఖ మేయర్ బరిలో ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి
గుంటూరుకు నూరి ఫాతిమా.. కర్నూలు..
కడపలోనూ మహిళలకే ప్రాధాన్యం
అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు
అమరావతి, : స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూలు ప్రకటించిన నేపధ్యంలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నిరకాల శక్తియుక్తులను కూడగడుతోంది.. పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో గత మూడు నెలలుగా కసరత్తు జరువుతోంది. కూటమి పార్టీలకు దీటైన ప్రత్యామ్నాయంగా గట్టిపోటీనిచ్చే దిశగా వ్యూహరచన చేస్తోంది. మునిసివల్, పంచాయతీ, జెడ్సీ, ఎంపీపీ ఎన్నికల్లో మహిళలకు పెద్దఎత్తున సీట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికల సంకేతాలు అందినప్పటి నుంచే పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అభ్యర్ధుల ఎంపిక బాధ్యతలను జిల్లాలో మాజీ మంత్రులు, రీజనల్ కోఆర్డినేటర్లు, స్థానిక నేతలకు బాధ్యతలు అప్పగించారు. గత నెల రోజుల క్రితమే ఇద్దరు, ముగ్గురు పేర్లతో ముఖ్య నేతలు జగన్ ముందు జాబితా ఉంచినట్లు చెబుతున్నారు. ఎన్నికల షెడ్యూలు విడుదలై 18వ తేదీ నుంచి నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉన్నందున మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు మునిసిపల్ చైర్మన్ల అభ్యర్థుల జాబితా ఇప్పటికే ఖరారు చేసినట్లు తెలియవచ్చింది. ప్రతిష్టాత్మక నగరాల్లో వైసీపీ ఫైర్ బ్రాండ్లను రంగంలో దించుతు న్నారు. సామాజిక, వర్గ, స్థానిక సమీకరణలు దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులపై తుది నిర్ణయం తీసుకున్నారని పార్టీవర్గాల సమాచారం. అధికార తెలుగుదేశం పార్టీ బీసీమంత్రానికి తగ్గ ప్రత్యామ్నాయాలను అన్వేషించే పనిలో వైసీపీ అధిష్టానం ముమ్మరంగా కసరత్తు జరుపుతోం ది. విజయవాడ నగరపాలక సంస్థ మేయర్గా మాజీ మేయర్, బీసీ వర్గానికి చెందిన రాయన భాగ్యలక్ష్మికి మరో ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలి. సింది.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు విభజిత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు విజయవాడ కేంద్ర బిందువుగా ప్రసిద్ధి గాంచింది.. కమ్యూనిస్టులు, కాంగ్రెస్, తెలుగుదేశం, గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల నుంచి మేయర్లుగా అన్నివర్గాలు.. రాజకీయపార్టీలను విజయవాడ నగర ప్రజలు ఆదరించారు.. ప్రస్తుతం రాజ ధానిలో అంతర్భాగం కావటంతో ఈ ఎన్నిక లను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది.. నగరంలోని 46వ డివిజన్ నుంచిగత ఎన్నికల్లో ఆమె పోటీచేసి ఏకగ్రీవంగా మేయర్ పదవిని అలంకరించారు. రాజధాని ప్రాంతంలో బీసీ మహిళగా మరో అవకాశంపై వైసీపీ అదిష్టానం పరిశీలన జరుపుతోంది. విజయవాడ కార్పొ రేషన్ ను తిరిగి దక్కించుకునే ప్రయత్నాలు ప్రారంబించింది. ఇదిలా ఉండగామరో ప్రతిష్టా త్మక మెట్రోపాలిటన్ నగరం గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పదవికి ఎమ్మెల్సీ వరుడు కళ్యాణిని వైసీపీ అభ్యర్థిగా రంగంలో దించుతున్నారనే ప్రచారం జరుగు తోంది. 2021లో స్థానిక సంస్థల కోటాలో వైసీపీ ఎమ్మెల్సీగా కళ్యాణి ఎన్నికయ్యారు. వచ్చే ఏడాది డిసెంబర్ లో పదవి కాలం ముగియనుంది.. వెలమ సామాజికవర్గానికి చెందిన ఆమెకు స్థానిక ఎన్నికల్లో ప్రాతినిధ్యం కల్పిం చడం ద్వారా కూటమి పార్టీలకు గట్టిపోటీ ఇవ్వా అనే యోచనలో జగన్ ఉన్నట్లు తెలిసింది.. తెలుగుదేశం పార్టీతో రాజకీయ ఆరంగేట్రం చేసిన కళ్యాణి 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున శ్రీకాకుళం ఎంపీగా పోటీచేసి వరాజ యం పొందారు.. పీఆర్పీ కాంగ్రెస్లో విలీనం అనంతరం 2012 వైసీపీ ఆవిర్భావం తొలి నాళ్లలోనే ఆ పార్టీలో చేరి అంకితభావంతో ర్డు పనిచేస్తున్నారు.. కూటమి సర్కార్ తీసుకునే నిర్ణయాలను కౌన్సిల్లో ప్రస్థావించటంతో పాటు పార్టీకి విధేయురాలిగా ఉన్నారు. విద్యా, రాజకీయ రంగాల్లో అనుభవం ఉన్న ఆమెను విశాఖనుంచి పోటీకి నిలవటం ద్వారా విజయా వకాశాలపై విశ్లేషణలు సాగుతున్నాయి.. రాష్ట్రం మొత్తంగా 13 కార్పొరేషన్లు 87 ముని సివల్, నగర పంచాయతీలకు జరిగే ఎన్నికల్లో అన్నిచోట్ల అభ్యర్థుల బలాబలాలను అంచనా" వేసి ఆచితూచి అడుగేయాలని భావిస్తోంది. గురువారం 7 కార్పొరేషన్లు, 6 నగర పంచా యతీలు, 11 మునిసిపాల్టీలకు మేయర్, చైర్మన్ల అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది.. ఇక రాజధాని ప్రాంత పరిధిలోని గుంటూరు నగరపాలక సంస్థ మేయర్గా గుంటూరు తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, మైనారిటీ వర్గానికి చెందిన ముస్తాఫా కుమార్తె నూరి ఫాతిమా పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ముస్తాఫా గెలు పొందిన నాటి నుంచి ఆయన వారసురాలిగా ఫాతిమా క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశిం చారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తర పున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి వరాజయం పొందారు. ఈ సారి మేయర్ గా పోటీచేసి విజయం సాధించేందుకు వ్యూహరచన చేస్తు న్నారు. కాగా జగన్ సొంత జిల్లా కడప నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా బండి దీప్తిని బరిలో దించనున్నారు.. ఆమె భర్త బండి నిత్యానంద గత స్థానిక ఎన్నికల్లో కడప డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు. రెడ్డి సామాజికవర్గం కావటంతో కడప కార్పొరేషన్ ను తిరిగి దక్కించుకునేందుకు వైసీపీ పావులు కదుపుతోంది.. కాగా నెల్లూరు మునిసివల్ కార్పొరేషన్ మేయర్ పదవికి పార్టీ ముఖ్యనేత ఆనం విజయకుమార్ రెడ్డి పేరును తొలిసారిగా జగన్ ప్రకటించిన సంగతి విదితమే. ఒంగోలు మేయర్ అభ్యర్థిగా కుప్పం ప్రసాద్, ఏలూరు-గంటా మోహనరావు, మచిలీపట్నం లంకా జ్యోతి, కర్నూలు కోట మేయర్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మణి గాంధీ కుమార్తె సుశీల, విజయనగరం కోలగట్ల శ్రావణి, ఏలూరు-గంటా మోహనం వు పేర్లు ఖరారయ్యాయి.. తిరువతి మేయర్ పదవికి బీసీ వర్గానికి చెందిన మాజీ మేయర్ ఆర్ కిరీష పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలియవచ్చింది.. శుక్రవారం పూర్తి జాబితాను జిల్లాల వారీగా ప్రకటించాలని పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీచేసింది. కాగా జగన్ నేరుగా పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు ఆశావహులతో ఫోన్ ద్వారా నిరంతరం సంప్రతింపులు జరిపి కార్యకర్తలు, క్యాదర్ అభీష్టాలకు అనుగుణంంగా ఎంపిక కసరత్తు నిర్వహహించాలని పదే పదే దిశా నిర్దేశం చేస్తున్నారు.
మున్సిపాలిటీలలో.. ఇచ్చాపురం పిలక రాజ్యలక్ష్మి, పలాస- తలను శ్రీపద్మ, స్మర్సీపట్నం-చింతకాయల అనిత, యలమంచిలి-బుడ్డపు తులసి, తుని- రామతులసి, కొవ్వూరు మన్నే పద్మ. రామ చంద్రాపురం చింతపల్లి నాగేశ్వరరావు. కొండపల్లి- నల్లమోతు తేజస్వి, తెనాలి -మద్దాలి శేషాచలం, చీకాల ఇనర్ల షేర్లీ, బద్వేలు రాచవూడి వెంకట సాయికృష్ణ ప్రొద్దుటూరు, -పొర్రెడ్డి నరసింహరెడ్డి, పులివెందుల-వైఎస్ ప్రమీల, మ్మదనపల్లి- జింకా చలపతి అభ్యర్థి త్వాలు ఖరారయ్యాయి.
నగర పంచాయతీల్లో.. ఏలేశ్వరం- బాదిరెడ్డి ఆకాల, ఉయ్యూరు పోలు పైడిముక్కల దివ్య, గురజాల వీరారెడ్డి, కనిగిరి పులి పులి శాంతిరెడ్డి, బుచ్చి రెడ్డిపాలెం- షేక్ షకీలా బేగం, కమలాపురం -మర్ధుల కవిత పేర్లు ప్రకటించారు.