100 అడుగుల రెడ్ కార్పెట్..
ఎయిర్ పోర్టులో స్వయంగా స్వాగతించిన ట్రంప్,
మెలానియా ఇద్దరు నేతల శిఖరాగ్ర సమావేశంపై ప్రపంచ దేశాల ఆసక్తి
వాషింగ్టన్: చైనా అధ్యక్షుడు జీ జిన్నింగ్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘన స్వాగతం పలికారు. మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా బుధవారం జిన్సింగ్, ఆయన భార్య పెంగ్ లియువాన్.. వాషింగ్టన్ సమీపంలోని జాయింట్ బేస్ ఆండ్రూస్‌కు చేరుకున్నారు. అక్కడ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ స్వయంగా వారికి స్వాగతం పలికారు. స్వాగత వేడుకలో నాయకులు, వారి సతీమణులు కరచాలనం చేసుకుని, కొన్ని నిమిషాలు మాట్లాడి ఫొటోలకు పోజులిచ్చారు. మే నెలలో బీజింగ్‌లో ట్రంప్‌కు ఆతిథ్యం ఇచ్చిన తర్వాత జిన్సింగ్ ఈ పర్యటన చేస్తున్నారు. జిన్సింగ్ విమానం దిగిన ప్రదేశం నుంచి 100 అడుగుల పొడవైన రెడ్ కార్పెట్ పరిచారు. 21 మంది సభ్యులతో కూడిన గౌరవ వందనం బృందం, సైనిక బ్యాండ్, అమెరికా-చైనా జాతీయ జెండాలు, గన్ సెల్యూట్‌తో స్వాగత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమెరికా వైమానిక దళానికి చెందిన రెండు బీ-1 బాంబర్ విమానాలు గగనతలంలో విన్యాసం చేశాయి. విమానాశ్రయంలోనే విదేశీ నేతను అమెరికా అధ్యక్షుడు స్వయంగా స్వాగతించడం అరుదైన పరిణామంగా నిలిచింది. చైనా పట్ల అధ్యక్షుడు ట్రంప్ తన కఠిన వైఖరి నుంచి తీవ్రంగా వైదొలగుతున్న తరుణంలో, అధ్యక్షుడు జిస్పింగ్ దశాబ్ద కాలంలో వాషింగ్టన్లో లో తొలిసారి పర్యటిస్తున్నారు.
మూడు రోజుల పర్యటన
గురువారం వైటాస్లో అధికారిక స్వాగత కార్యక్రమం, ట్రంప్-జినింగ్ సమావేశం అనంతరం విందు జరిగింది. శుక్రవారం ఇరుదేశాల అధ్యక్ష దంపతులు వైట్‌హౌస్‌లో టీ కార్యక్రమంలో పాల్గొని, అనంతరం నేషనల్ ఆర్కైవ్స్ ను సందర్శిస్తారు. దాంతో జనపింగ్ పర్యటన ముగియనుంది. వీరి శిఖరాగ్ర సమావేశం అమెరికా-చైనా మధ్య వాణిజ్య సాంకేతిక, భౌగోళిక రాజకీయ విభేదాల నేపథ్యంలో జరుగుతుండటంతో అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.