ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై కేంద్రం
కసరత్తు డీఎంకే సహా విపక్షాల మద్దతు కోసం ప్రయత్నాలు
అనుకూలంగా మారుతున్న ప్రతిపక్షాలు వివక్షాల్లోని
విభేదాలు బిల్లు ఆమోదానికి మార్గం సుగమం
న్యూఢిల్లీ: మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజ ర్వేషన్ల అమలు, లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన బిల్లును మరోసారి పార్లమెంట్ ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతు న్నట్లు తెలుస్తోంది. ఈ కీలక అంశాలకు సంబంధించిన బిల్లుల ఆమోదం కోసం అక్టోబర్ లోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశముందని హస్తిన వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు సంబంధించి ఢిల్లీ రాజకీయాల్లో విస్తృత చర్చ సాగుతోంది. మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేయడం తోపాటు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు సంబందించిన ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. 2023లో పార్లమెంట్ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ చట్టం ప్రకారం లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంది. అయితే ఈ రిజర్వేషన్ల అమలు జనగణన, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో ముడిపడి ఉండటంతో వెంటనే అమల్లోకి రాలేని పరిస్థితులు ఉన్నాయి. మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచాలన్న లక్ష్యం ఒకవైపు ఉండగా, ఆ లక్ష్యాన్ని సాధించే ప్రక్రియలో నియోజకవర్గాల సంఖ్య, రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్య సమతౌ ల్యం వంటి అంశాలు మరోవైపు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబం ధించిన తదువరి కనరత్తును వేగవంతం చేయాలన్న ప్రయ త్నంగా తాజా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన చట్టం ఇప్పటికే ఉనికిలో ఉండగా, దాని అమలును ముందుకు తీసుకెళ్లేందు కు అవసరమైన రాజ్యాంగ, చట్టపరమైన చర్యలు ఏమిటన్నది కీలకంగా మారనుంది. కేంద్రం ప్రతిపాదించే మార్గంపై ఆధా రవడి ఈ అంశం పార్లమెంట్లో కొత్త రాజకీయ చర్చకు దారి తీసే అవకాశముంది. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్లకు అన్ని పార్టీలు సూత్రప్రాయంగా మద్దతు ప్రకటిస్తున్నప్పటికీ, వాటి అమలును నియోజకవర్గాల పునర్విభజనతో ర్విభజనతో అనుసంధానిం చడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తే మహిళా రిజర్వేషన్ల అంశం తోపాటు దేశ రాజకీయ ప్రాతినిధ్య వ్యవస్థలో మార్పులకు సంబంధిం చిన చర్చ కూడా ప్రాధాన్యం సంతరించు కోనుంది.
బిల్లులతో ముందుకే..!
ప్రత్యేక సమావేశాల నిర్వహణకు సంబంధించి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13న ముగిసినప్పటికీ, వాటిని ఇంకా ప్రొరోగ్ చేయకపోవడంతో ప్రాధాన్యం సంతరించు కుంది. అక్టోబర్ 26, 27 తేదీల్లో పార్లమెంట్ ప్రాంగణంలోని రాజ్యాంగ సదన్‌లో జరగనున్న 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్ కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక సమావేశాల తేదీలను నిర్ణయించే అవకాశం ఉందని సమాచారం. సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయిస్తే, ఎంపీలకు సుమారు వారం రోజుల ముందుగా నోటీసు ఇచ్చే అవకాశముంటుంది. ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం ద్వారా మహిళా రిజర్వేషన్ల అమలుపై ముందడుగు వేయడంతోపాటు. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన ప్రతిపాదనలపై రాజకీయ పార్టీల వైఖరిని స్పష్టం చేయించుకోవాలని కేంద్రం భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక నమగ్ర సవరణ (ఎస్వీఆర్), ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై వివక్షాల నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశాల ఊహాగానాలు తెరపైకి రావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించు కుంది. ఒకవైపు ఎన్నికల వ్యవస్థపై విపక్షాల ఆందోళనలు మరోవైపు మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన అంశాలు పార్లమెంట్లో చర్చకు వస్తే కేంద్రం, విపక్షాల మధ్య మరోసారి తీవ్ర వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో సాధించిన పురోగతిని పరిగణనలోకి తీసుకోకుండా కేవలం జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల సంఖ్యను పెంచితే తమ రాజకీయ ప్రాతినిధ్యం, పార్లమెంట్ లో ప్రభావం తగ్గుతాయన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు శిక్షపడకూడదన్న వాదన ఈ చర్చలో ప్రధానంగా మారింది. అందువల్ల నియోజకవర్గాల సంఖ్య పెంపుపై స్పష్టమైన హామీలు, రాష్ట్రాల మధ్య సమతౌల్యానికి భరోసా, మహిళా రిజర్వేషన్ల అమలుకు నిర్దిష్ట కార్యాచరణ వంటి అంశాలు కేంద్రం ముందున్న కీలక సవాళ్లుగా మారనున్నాయి. బిల్లులను తిరిగి ప్రవేశపెట్టడం మాత్రమే కాకుండా, అవసరమైన ప్రత్యేక మెజారిటీని సాధించడం. దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను తగ్గించడం, రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టడం ప్రభుత్వానికి అసలు పరీక్ష కానుంది. ఏప్రిల్‌లో ఎదురైన చేదు అనుభవంతో ఈసారి కేంద్రం మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తుందా? విపక్ష పార్టీల్లోని విభేదాలు బిల్లుల ఆమోదానికి మార్గం సుగమం చేస్తాయా? లేక మహిళా రిజర్వేషన్ల పేరుతో పునర్విభజనను ముందుకు తీసుకెళ్తున్నారన్న విమర్శలు మరింత తీవ్రరూపం దాలుస్తాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రత్యేక సమావేశాలపై అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే బిల్లులపై కేంద్రం అనుసరించనున్న వ్యూహం, వాటి ఆమోదానికి ఉన్న అవకాశాలపై మరింత స్పష్టత రానుంది.