ఐదు టీ20ల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో భారత్
సంజూ శాంసన్ వరుస వైఫల్యాల నేపథ్యంలో
అతి సెలక్షన్‌పై ఆసక్తి అతడి స్థానంలో
సూర్యవంశీని తీసుకుంటారా అనే సందేహాలు
భారీగా పరుగులిచ్చిన మయాంక్ యాదవ్
పరిస్థితిపైనా చర్చ రెండో టీ20 అయినా
గెలవాలనే కోణంలో వెస్టిండీస్ వ్యూహాలు
తొలి టీ20లో వెస్టిండీస్ పై అదరగొట్టిన భారత్.. అదే జోరులో సిరీస్ లో 2-0తో ముందంజ వేయాలని చూస్తోంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో భారీ ఓటమి ఎదురైన వెస్టిండీస్ ఎలాగైనా వుంజుకుని సిరీన్‌ను నమం చేయాలని పట్టుదలగా ఉంది. అయితే రాంచీలో శుక్రవారం జరిగే రెండో టీ20కి ముందు ఫలితం కంటే ఎక్కువగా ఆసక్తి రేవుతున్నది భారత జట్టు ఎంపికే సంజూ శాంసన్ కొనసాగుతాడా? వైభవ్ సూర్యవంశీకి అవకాశం వస్తుందా? తొలి మ్యాచ్‌లో భారీగా వరుగులు ఇచ్చిన మయాంక్ యాదవ్ కు మరో ఛాన్స్ ఇస్తారా? ఈ ప్రశ్నలకు రేపు సమాధానం దొరకనుంది. లక్నోలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వెస్టిండీస్ 171 పరుగులు చేయగా.. భారత్ కేవలం 14.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 42 బంతుల్లోనే అజేయంగా 102 పరుగులు చేసి మ్యాచ్‌ను ఏకపక్షం చేశాడు. ఇషాన్ కిషన్‌తో కలిసి 137 పరుగుల అజేయ భాగస్వామ్యంతో భారత్‌కు సునాయాన విజయాన్ని అందించాడు.
సంజూ స్థానంపై ఉత్కంఠ
తొలి మ్యాచ్‌లో సంజూ శాంసన్ 11 పరుగులకే వెనుదిరిగాడు. అంతకుముందు అతడి చివరి నాలుగు టీ20 ఇన్నింగ్స్‌లు 9, 7, 2, 11 పరుగులుగా ఉ న్నాయి. దీంతో ఓపెనింగ్ స్థానంపై చర్చ మొదలైంది. జట్టులో వైభవ్ సూర్యవంశీ రూపంలో దూకుడైన మరో ఓపెనర్ ఉన్నాడు. పవర్ ప్లేలోనే బౌలర్లపై విరుచుకుపడే సామర్థ్యం వైభవ్‌కు ఉంది. అందుకే అతడిని తుది జట్టులోకి తీసుకుంటే భారత్ ఓపెనింగ్ కూర్పులో మార్పు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఒక్క మ్యాచ్‌లో విఫలమైనందుకు సంజూను పక్కన పెడతారా? లేక అనుభవం ఉన్న వికెట్కెవర్ బ్యాటర్ కు మరో అవకాశం ఇస్తారా? అన్నదే అసలు ఉత్కంఠ.
మయాంకకు మరో అవకాశం?
బౌలింగ్‌లోనూ భారత్‌కు ఒక ప్రశ్న ఎదు రవుతోంది. తొలి టీ20లో మయాంక్ యాదవ్ తన మొదటి ఓవర్లోనే 16 పరుగులు ఇచ్చాడు. మొత్తంగా కూడా అతడి బౌలింగ్‌లో పరుగుల వరద పారింది. అయితే రూథర్‌ఫోర్డ్‌ను ఔట్ చేసి ఒక వికెట్ సాధించాడు. మరోవైపు అరంగేట్ర మ్యాచ్‌లో నమన్ ధీర్ 3 వికెట్లతో అదరగొట్టాడు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు. దీంతో స్పిన్ విభాగంపై భారత్‌కు పెద్దగా ఆందోళన కనిపించడం లేదు. పేస్ కూర్పులోనే మార్పు చేసే అవకాశం ఉంది. అయితే మయాంక్‌ను వెంటనే తప్పించకుండా మరో అవకాశం ఇవ్వాలన్న అభిప్రాయం కూడా ఉంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రయోగాలకు అవకాశం ఉ న్నప్పటికీ.. సిరీస్ ఆధిక్యాన్ని 2-0కి
పెంచుకోవడం కూడా భారత్‌కు ముఖ్యమే.
శ్రేయస్ ఫామ్.. భారత్‌కు పెద్ద బలం
తొలి మ్యాచ్‌కు ముందు శ్రేయస్ అయ్యర్ ఫామ్ ప్రశ్నలు తలెత్తాయి. కానీ కెప్టెన్ తన బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. 43 బంతుల్లో 102 పరుగులతో టీ20ల్లో తొలి శతకాన్ని నమోదు చేశాడు. దీంతో భారత మిడిలార్డర్‌కు భారీ బలం వచ్చింది. తొలి మ్యాచ్‌లో 36 వరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్‌ను అయ్యర్, ఇషాన్ కిషన్ కలిసి గట్టెక్కించారు. ఇప్పుడు వెస్టిండీస్ బౌలర్లు అయ్యర్‌ను ఎలా అడ్డుకుంటారన్నది కూడా మ్యాచ్‌లో కీలక అంశంగా మారనుంది.
వెస్టిండీస్ ఏం చేస్తుంది?
తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ పవర్‌లోనే మూడు వికెట్లు కోల్పోయింది. తర్వాత షాయ్ హోప్ 62, రూథర్‌ఫోర్డ్ 56 పరుగులతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. కానీ చివరికి 171 వరుగులకే ఆలౌటైంది. భారత్ బ్యాటింగ్ బలం ముందు ఈ స్కోరు సరిపోలేదు. రాంచీలో పరిస్థితులను ఉపయోగించుకుని భారత్‌పై ఒత్తిడి పెంచాలని కరీబియన్ జట్టు చూస్తోంది. ముఖ్యంగా భారత ఓపెనర్లను తొందరగా ఔట్ చేయడం, అయ్యర్‌కు పరుగులు చేయకుండా కట్టడి చేయడం వెస్టిండీస్ వ్యూహంలో కీలకం కానుంది.
రాంచీలో ఛేజింగు పైచేయి
రాంచీ జేఎస్సీఏ స్టేడియంలో ఇప్పటివరకు ఏడు టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో నాలుగు మ్యాచ్‌లో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. మూడు మ్యాచ్‌ల్లో చౌలుత బ్యాటింగ్ చేసిన జట్టు విజయం సాధించింది. ఇక్కడ తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 135 పరుగులుగా ఉంది. అయితే భారీ స్కోర్లకు కూడా ఈ మైదానం వేదికైంది. శ్రీలంకపై భారత్ 196/6 చేయడం ఇక్కడ అత్యధిక టీ20 స్కోరు. న్యూజిలాండ్ పై భారత్ 155 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించడం ఇక్కడ అత్యధిక విజయవంతమైన ఛేజ్.