ఇంగ్లండ్ మాజీ స్టార్ సంచలన కామెంట్స్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిపై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేనర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే వరల్డ్్కప్ తనకు చివరిదని కోహ్లి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ టోర్నీ తర్వాత కూడా కోహ్లి క్రికెట్‌కు వీడ్కోలు చెప్పకపోవచ్చని వనేసర్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల వన్డేల్లో కోహ్లి 15 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ సందర్భంగా కోహ్లి ఆటపై వనేనర్ ప్రశంసలు కురిపించాడు. అతడిలో ఆటపై ఆకలి, దూకుడు, ఫిట్నెన్పై శ్రద్ధ తనను ఆకట్టుకుంటున్నాయని చెప్పాడు. కోహ్లి శిక్షణ చూస్తే తాను కూడా జిమ్‌కు వెళ్లాలనిపిస్తుందని పేర్కొన్నాడు. "విరాట్‌లో ఇప్పటికీ పరుగులు చేయాలనే ఆకలి చాలా ఉంది. ప్రతి మ్యాచ్‌ను ఎంతో తీవ్రతతో ఆడతాడు. ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యం ఇస్తాడు. చుట్టూ ఉన్న వారిని కూడా ప్రోత్సహిస్తాడు. 10-15 మ్యాచ్‌లో మిగిలి ఉన్నాయని భావిస్తే ప్రతి మ్యాచ్‌ను ప్రత్యేకంగా చూస్తాం. కోహ్లి కూడా ప్రస్తుతం అదే మైండ్‌సెట్ ఆడుతున్నాడు. ప్రతి బంతికి తన వంద శాతం ఇస్తున్నాడు. అందుకే వరల్డ్ కప్ తర్వాత అతడు రిటైర్ అవుతాడని నాకు అనిపించడం లేదు. అతడి నుంచి ఇంకా చాలా క్రికెట్ చూడొచ్చు" అని పనేసర్ చెప్పాడు. మరోవైపు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మపైనా పనేసర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ గొప్ప ఆటగాడని, అతడికి ప్రపంచకప్ జట్టులో అవకాశం ఇవ్వాలని అన్నాడు. రోహిత్ క్రీజులో కుదురుకుంటే విధ్వంసకరంగా బ్యాటింగ్ చేయగలడని పేర్కొన్నాడు. "రోహిత్ అద్భుతమైన ఆటగాడు. అతడు ఫామ్‌లోకి వస్తే బ్యాటింగ్ ప్రత్యర్థులను చిత్తు చేయగలడు. భారత్‌కు తడి లాంటి నాణ్యమైన ఆటగాడు అవసరం" అని పనేసర్ చెప్పాడు.