కింగ్ నాగార్జున ప్రతిష్టాత్మక 100వ సినిమా 'కింగ్ 100' పై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఆ మధ్య కుబేర సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కూలీ సినిమాలో పవర్ ఫుల్ విలన్‌గా నటించిన నాగార్జున కాస్త గ్యాప్ తర్వాత హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నాగార్జున 2024లో నా సామిరంగ సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఫలితం ఏంటో ప్రత్యేకంగా చెప్పసక్కర్లేదు. హీరోగా నాగార్జున సాలిడ్ హిట్ అందుకుని చాలా కాలం అయింది. బంగార్రాజు సినిమా తర్వాత నాగార్జున నుంచి ఆ స్థాయి హిట్ కోసం, ఆ రేంజ్ మాన్ పాత్ర కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే నాగార్జున మాత్రం కాస్త సైడ్ ట్రాక్ వెళ్లాడు అని అభిమానులు కాస్త అవేదన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు 'కింగ్ 100' సినిమాతో నాగార్జున తిరిగి ఫామ్‌లోకి వస్తాడని, వరుసగా ఇతర సీనియర్ స్టార్స్ చేసినట్లుగా నాగ్ నుంచి సినిమాలు రాబోతున్నాయని అభిమానులు సమ్మకంగా ఉన్నారు. నాగార్జున 'కింగ్ 100' సినిమా విషయంలో అభిమానుల్లో కాస్త గందరగోళం కనిపిస్తోంది. సినిమా విడుదల తేదీ ఇప్పటికే ప్రకటించారు. డిసెంబర్ 24న సినిమాను క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని నిర్ణయించారు. అధికారికంగా డేట్ సైతం ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు షూటింగ్ విషయమై ఎలాంటి అప్డేట్ లేదు. నాగార్జున బర్త్ డే సందర్భంగా సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెల్సిందే. దాంతో ఇంత తక్కువ సమయంలోనే సినిమా పూర్తి అవుతుందా అనే అనుమానాలు కొందరిలో ఉన్నాయి. అందుకే ఫ్యాన్స్‌లో కొందరు సినిమా ఈ ఏడాది డిసెంబర్లో విడుదల కాకపోవచ్చని, పచ్చే ఏడాది సమ్మర్ వరకు వెయిట్ చేయాల్సి రావచ్చు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ అక్కినేని ఫ్యామిలీ కాంపౌండ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సినిమా విడుదల విషయంలో ఎలాంటి మార్పు ఉండదట.