డీ నోటిఫై చేయడంపై కేంద్ర ప్రభుత్వానికి
సుప్రీంకోర్టు నోటీసులు ఎలాంటి పరిశీలనల
ఆధారంగా నిర్ణయించారని ప్రశ్న? జవాబులు రానివ్వండి..
సంతృప్తికరంగా లేకపోతే చట్టం తన పని తాను చేస్తుందని ధర్మాసనం వ్యాఖ్య
న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలోని నిర్ణీత నిరసన ప్రదేశాల జాబితా నుంచి జంతర్ మంతర్‌ను తొలగిస్తూ ఢిల్లీ పోలీసులు జారీ చేసిన ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. ఈ నిర్ణయం ప్రభుత్వమౌఖికపరిశీలనల ఆధారంగా తీసుకున్నారా? లేక నిరసన వేదికగా జంతర్ మంతర్ యోగ్యతను అంచనా వేసిన తర్వాత తీసుకున్నారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జంతర్ మంతర్ డీనోటిఫై చేసేటప్పుడు ఢిల్లీ పోలీసులు ఆలోచించారా? లేదా? అనే విషయాన్ని పరిశీలిస్తామ నిసుప్రీంకోర్టు తెలిపింది. అక్టోబర్ 11 నాటి స్టాండింగ్ ఆర్డర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటీషన్‌పై సుప్రీంకోర్టు గురువారం కేంద్రానికి నోటీసు జారీ చేసింది. ఈ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిర్దేశిత నిరసన స్థలం జాబితా నుండి తొలగించి, ఢిల్లీ పోలీసులు మూడు ప్రత్యామ్నాయ వేదికలను నోటిఫై చేశారు. ఆ స్థలం వినియోగం, సమర్థతకు సంబంధించి సంబంధిత అధికారులు ఆలోచించి నిర్ణయం తీసుకున్నారా లేదా అనే విషయాన్ని కోర్టు పరిశీలిస్తుం దని సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జయమాయ బాగ్సీలతో కూడిన ధర్మాననం మౌఖికంగా వ్యాఖ్యానించింది. నిరసనకారుల మాటలు స్పష్టంగా వినిపించే ప్రదేశమే నిరసన స్థలంగా ఉండాలని విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ముక్తా గుప్తా వాదించారు. ఆ స్థలం నోటిఫికేషన్‌ను ప నరుద్ధరించాలని.. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు డీనోటిఫికేషన్ జరిగిందని సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ నొక్కి చెప్పారు. దీనికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ, డీనోటిఫికేషన్‌కు సుప్రీంకోర్టు మునుపటి నిర్ణయం ఆధారం కాదని అన్నారు.
ఒక కమిటీని ఏర్పాటు చేశారని, అది ఒక నివేదికను సమర్పించిం దని, ఈ నిర్ణయానికి గల కారణాలను కూడా నమోదు చేశారని, ఆ కమిటీ సిఫార్సు మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ అంశాన్ని సాంకేతిక కోణంలో క డా అర్ధం చేసుకోవాలని జస్టిన్ బాగ్ని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు దగ్గరగా ఉ న్నందున జంతర్ మంతర్ ను తరలించకూడదనే వాదనను ఆయన ప్రస్తావిస్తూ, దీనిపై స్పందన తెలియజే "యాలని కోర్టు ప్రభుత్వాన్ని కోరుతుందని చెప్పారు. న్యాయవాది స్వాతి సింగ్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. నిరసనలను సుదూర ప్రాంతాలకు తరలించడం వల్ల శాంతియుతంగా సమావేశమయ్యే ప్రాథమిక హక్కు భావప్రకటనా స్వేచ్ఛ నిష్ప్రయోజనం కావచ్చునని ఆమె వాదించారు. కేంద్రానికి, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేస్తూ, వారి సమాధానాన్ని కోరుతున్నా మని.. వారు సమాధానమివ్వనివ్వండి.
ఒకవేళ ఆ సమాధానం. సంతృప్తికరంగా లేకపోతే అప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.