నాయకులే దాటితే.. మిగిలిన వారిని
నియంత్రించడం కష్టం విదేశాల్లో
విద్యార్థుల ఆందోళనలు హింసాత్మకం
అయ్యాయ్ సీజేపీ నేతల తీరుపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి
మీరు జెన్ కాదు కదా అని వ్యాఖ్య పిటిషన్ వెనక్కితీసుకున్న నేతలు
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా వ్యవహారశైలిపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అనుమతి లేని ప్రాంతంలో నిరసనకు దిగడం, పోలీసుల బారికేడ్లను దాటి వెళ్లడం. వంటి చర్యలు శాంతిభద్రతల సమస్యలకు దారితీస్తాయని వ్యాఖ్యానించింది. నిరసనల్లో నాయకులే బారికేడ్లను దాటితే, వారిని అనుసరించి ఇతరులు కూడా రావచ్చని, వారందరినీ నియంత్రించడం కష్టమవుతుందని పేర్కొంది. విదేశాల్లో(తాజాగా ఫ్రాన్స్‌లో) విద్యార్థుల ఆందోళనలు కాస్తా హింస, భవనాల దహనం వరకు వెళ్లిన ఉ దంతాలను ఈ సందర్భంగా ప్రస్తావించింది. సీజేపీ నేతల జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా బుధవారం జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలిపేందుకు అనుమతి లేకున్నా అక్కడికి వెళ్లడం, గతంలో ఇచ్చిన శాంతిభద్రతల హామీ పత్రాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలపై కోర్టు ప్రశ్నలు సంధించింది. విచారణ సందర్భంగా నేతల వయసును కూడా హైకోర్టు ప్రశ్నించింది. సౌరవ్ వయసు 27 ఏళ్లు, అశుతోష్ వయసు 32 ఏళ్లు అని వారి తరపు న్యాయవాది చెప్పారు. స్పందించిన ధర్మాసనం.. వీరేమీ జనీజీ కాదని వ్యాఖ్యానించింది. 1997 తర్వాత పుట్టిన వారిని మాత్రమే జెన్నీ అంటారని పేర్కొంది. తొలుత విద్యార్థుల ఆందోళనగా ప్రారంభమైన నిరసన ఇప్పుడు మరో అంశం చుట్టూ సాగుతోందని, నిరసనకారులు మారకపోయినా ఆందోళనకు కారణాలు మారుతున్నాయని కోర్టు పేర్కొంది.
సౌరవ్, అశుతోష్ విడుదల
సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా.. తిహార్ జైలు నుంచి బుధవారం రాత్రి విడుదలయ్యారు. జంతర్‌మంతర్ వద్ద ఆందోళనలకు ప్రభుత్వం తిరిగి అనుమతిచ్చే వరకు ఆ ప్రాంతంలో ఎలాంటి నిరసన ప్రదర్శనలు చేపట్టమని సౌరవ్, అశుతోష్ లిఖితపూర్వక హామీ ఇచ్చారు. అలాగే రూ. 50 వేల చొప్పున పూచీకత్తు బాండ్లు సమర్పించారు. దీంతో స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (ఎస్ఎం) వారి విడుదలకు ఆదేశాలు చేశారు. ఈ నెల 14న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అనుమతి లేకుండా నిరసనలు చేసిన కేసులో వారిని అరెస్టు చేయగా ఎస్ఈఎం.. 7 రోజుల పాటు జ్యడీషియల్ రిమాండ్‌కు పంపిన సంగతి తెలిసిందే.
సీజేపీ ఉద్యమానికి తాత్కాలిక విరామం
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ తాము చేస్తున్న పోరాటాలకు పండుగల నేపథ్యంలో తాత్కాలిక విరామం ఇస్తున్నామని సీజేపీ వ్యవస్థాపకుడు దీప్కే వెల్లడించారు. పండుగల వేళ కాక్రోచంగా తమ కుటుంబాలతో సంతోషంగా గడపాలని పిలుపునిచ్చారు. అంతేకాక, సీజేపీ అధికార ప్రతినిధులు ఆశుతోశ్ రంకా, సౌరవ్ దాస్ సీజేపీ అసలైన నాయకులని, ఇప్పటివరకు వారి ఆదేశాలనే తాను పాటిస్తున్నానని దీప్కే పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఆందోళనలు, బంగ్లాదేశ్, నేపాల్‌లో జరిగిన ఘటనలతో సీజేపీ నిరసనలకు పోలిక పెడుతున్న వారు సిగ్గు పదాలని దీప్కే ఎద్దేవా చేశారు. సీజేపీ పోరాటాలకు ప్రధాన బలం శాంతి అని తెలిపారు.