కెప్టెన్ హోవ్ అజేయ శతకం
చెలరేగిన రూథర్‌ఫోర్డ్, షెఫర్డ్ శాంసన్ పోరాటం వృథా
రాంచీ: వెస్టిండీస్ ముందు 250 పరుగుల లక్ష్యం.. మంచు ప్రభావం ఉన్నప్పటికీ ఇంత భారీ ఛేదన కష్టమేనని అంతా భావించారు. దీనికి తోడు తొలి ఓవర్లోనే రెండు వికెట్లు ఫట్. అయితే పొట్టి ఫార్మాట్లో తామెంత ప్రమాదకరమో కరీబియన్లు చాటి చెప్పారు. కేవలం బౌండరీల రూపంలోనే 204 వరుగులు సాధించి ఇది తమ ఆటంటూ భారత బౌ లర్లను బెంబేలెత్తించారు. ముఖ్యంగా కెప్టెన్ షాయ్ హోప్ (45 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 102 నాటౌట్) తన అసాధారణ ఫామ్‌తో తుదికంటా నిలిచాడు. అతడికి రూథర్‌ఫోర్ట్ (37 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 84) జత కలవగా.. ఆబర్లో షెఫర్డ్ (13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 34 నాటౌట్) మోతెక్కించాడు. దీంతో శుక్రవారం భారత్‌లో ఉ త్కంఠభరితంగా సాగిన రెండో టీ20లో విండీస్ ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. అలాగే సిరీస్‌లో 1-1తో నిలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 249 వరుగులు చేసింది. శాంసన్ (41 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 82), తిలక్ వర్మ (18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 16 నాటౌట్), ఇషాన్ (22 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 43), శ్రేయాస్ (18 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 40) వేగంగా ఆడారు. చేజ్‌కు మూడు, స్ప్రింగర్‌కు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో విండీస్ 18.3 ఓపర్లలో 4 వికెట్లకు 252 పరుగులు చేసి గెలిచింది. మయాంక్‌కు 3 వికెట్లు లభించాయి. ప్లేయర్ ఆఫ్ డ మ్యాచ్‌గా హోప్ నిలిచాడు.
ఏమా బాదుడు?: భారీ ఛేదనలో ఐదు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయినా విండీస్ బ్యాటర్లు వెనుకంజ వేయలేదు. కెప్టెన్ హోప్, రూథర్‌ఫోర్ట్ హిట్టింగ్తో భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. అలాగే పోవెల్ (24) క్రీజులో ఉ న్నంతసేపు బ్యాబ్ ఝుళిపించి ఆరో ఓవర్లో వెసుదిరిగాడు. అటు హోప్ బౌండరీలతో హోరెత్తించగా, రూథర్‌ఫోర్డ్ వచ్చీ రాగానే చెలరేగాడు. దీంతో పవర్ ప్లేలో విండీస్ 72/3తో నిలిచింది. రూథర్‌ఫోర్డ్ 12వ ఓవర్లో 6,4,6, 6తో 23 రన్స్ రాబట్టాడు. 24 బంతుల్లోనే అతడి ఫిఫ్టీ పూ-ర్తవడం విశేషం. చివరకు 15వ ఓవర్లో కుల్దీపనకు చిక్కడంతో రూథర్ ఫోర్డ్ జోరుకు తెరవడింది. హోప్నికు షెఫర్డ్ జత కట్టడంతో బౌలర్ల కష్టాలు మరింతగా పెరిగాయి. 17వ ఓవర్లో 24 రన్స్ రాగా భారత్ ఓటమి బరారైంది. 19వ ఓవర్లో రెండు సిక్సర్లతో హోప్ 45 బంతుల్లోనే సెంచరీతో పాటు మ్యాచ్‌ను ముగించాడు.
ఆరంభం.. ముగింపు అదుర్స్: టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ హోప్ మంచు ప్రభావాన్ని దృష్టిలో ఉ ంచుకుని బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత బ్యాటర్లలో సంజూ శాంసన్ దూకుడైన ఆట హైలైట్‌గా నిలిచింది. అయితే 6, 42 పరుగుల వ్యక్తిగత స్కోర్ల వద్ద శాంసన్ క్యాచ్‌లను ఫీల్డర్లు వదిలివేయడం కలిసివచ్చింది. డెత్ ఓవర్లలో తిలక్, కెప్టెన్ శ్రేయా స్ ఎడాపెడా బాదేయడంతో స్కోరు 245 దాటగలిగింది. అభిషేక్ (20) ఈ సారి కూడా న్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. సంజూ ఆరో ఓవర్లోనే ఫిఫ్టీని పూర్తి చేశాడు. అటు పవర్ ప్లేలో భారత్ 79/1 స్కోరుతో నిలిచింది. అయితే చక్కగా కుదురుకున్న ఇషాన్‌ను 12వ ఓవర్లో స్పిన్నర్ చేజ్ బౌల్డ్ చేశాడు.
దీంతో రెండో వికెట్ కు 97 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా వచ్చిన దూబే (7)ను సైతం తన తర్వాతి ఓవర్లోనే చేజ్ క్లీన్బెల్ట్ చేశాడు. అటు శాంసన్ భారీ షాట్‌కు వెళ్లి పేసర్ స్ప్రింగర్‌కు చిక్కాడు. అనంతరం తిలక్ శ్రేయాస్ విజ్బంధణ సాగింది. 17వ ఓవర్లో శ్రేయాస్ రెండు సిక్సర్లు తర్వాతి ఓవర్లో అతడి 6.4 తిలక్ 4,4తో పరుగుల వరద పారింది. ఆఖరి ఓవర్లో తిలక్ మరింతగా చెలరేగి హ్యాట్రిక్ సిక్సర్లు బాదగా..
శ్రేయాస్ ఐదో బంతికి వెనుదిరిగాడు. మొత్తంగా చివరి ఐదు ఓవర్లలో భారత్ ఏఠంగా 80 వరుగులు రాబట్టింది. వెస్టిండీస్‌పై వేగవంతమైన (21 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన భారత బ్యాటర్‌గా శాంసన్, విరాట్‌తో సమంగా నిలిచాడు.
అంతర్జాతీయ టీ20ల్లో రెండో భారీ ఛేదన (250)ను నమోదు చేసిన జట్టుగా వెస్టిండీస్. దక్షిణాఫ్రికా (విండీస్్ప 259) టాప్ ఉంది.
స్కోరుబోర్డు
భారత్: అభిషేక్ (సి) మోటీ (బి) చేజ్ 20, శాంసన్ (సి) కమిల్ (బి) (సింగర్ 82, ఇషాన్ (బి) చేజ్ 43, దూరే (బి) చేజ్ 7, శ్రేయాస్ (సి) హెట్మయెర్ (బి) స్ప్రింగర్ 40, తిలక్ (నాటౌట్) 44, నమన్ (నాటౌ ట్) 4 ఎక్స్ ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 249/5. వికెట్ల పతనం: 1-42, 2-189, 8-158, 4-162, 5-245; బౌలింగ్: హౌసీన్ 3-0-46-0, షెఫర్డ్ 3.4-0-47-0, చేజ్ 4-0-24-3, మోటీ 2-0- 21-0, 5 3-0-39-0, స్ప్రింగర్ 4-0-64-2, పోవెల్ 0.2-0-7-0.
వెస్టిండీస్: హోప్ (నాటౌట్) 102, కమిల్ (సి-నబ్) బిష్ణోయ్ (బి) మయాంక్ 4, హెట్మాయెర్ (బి) మయాంక్ 0, పోవెల్ (బి) మయాంక్ 24, రూథర్‌ఫోర్డ్ (సి) శాంసన్ (బి) కుల్దీప్ 84, షెఫర్డ్ (నాటౌట్) 34; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 15.9 ఓవర్లలో 252/4; వికెట్ల పతనం: 1-5, 2-5, 3-58, 4-178; బౌలింగ్: మయాంక్ 3-0-36-3, అర్హ దీప్ 4-0-45-0, అక్షర్ 3.3-0-63-0, దూబే 2-0-30-0, ముల్టీవ్ 4-0-53-1, సమన్ 2-0-25-0.