ప్రభుత్వ ప్రధాన అజెండా కూడా అదే
20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం
రాజకీయ నిరుద్యోగులే డీఎస్సీపై ఆరోపణలు చేస్తున్నారు.
విద్యార్థులకు కొత్త టెక్నాలజీలు వ్యవస్థలో మార్పే
జెనీ కోరిక సీఎం పదవి నాకు ప్రాధాన్యం కాదు
విద్యా వ్యవస్థలో మార్పులు ముఖ్యం సౌత్ కాంక్లేవ్ మంత్రి లోకేశ్
అమరావతి, : 'యువత మమ్మల్ని అడుగుతున్న ఒకే ఒక్క విషయం ఉద్యోగాల కల్పన. అందుకే మా ప్రభుత్వం ఉద్యోగాల కల్పనను ప్రధాన అజెండాగా పెట్టుకుంది. సీఎం నుంచి అన్ని స్థాయిల్లోని ఉద్యోగులు ఆ అజెండాపైనే పనిచేస్తున్నారు. యువత కలల సాకారం కోసమే 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం నిర్ణయించాం' అని విద్యాశాఖ మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. బుధవారం కేరళంలోని కొచ్చిలో జరిగిన ఇండియా టుడే సౌత్ కాంక్లేవ్ లోకేశ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లోకేశ్ మాట్లాడుతూ.. డీఎస్సీపై రాజకీయ నిరుద్యోగులే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. క్వాంటమ్ అనేది ఊహకాదని, ఆ నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీని ఏపీ అందిపుచ్చుకుందని అన్నారు. తొలి 156 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ను అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. 'నరై'పైనా తన అభిప్రాయాన్ని తెలిపారు. వ్యవస్థను ప్రశ్నించే వారికి కొంత బాధ్యత ఉండాలన్నారు. రాజకీయ పార్టీగా టీడీపీ కూడా సర్కు సంబంధించిన వివిధ అంశాలపై ఎప్పటికప్పుడు వివరణ కోరిందని, ఎన్నికల సంఘం ఇచ్చిన వివరణను టీడీపీ పరిశీలించిందని తెలిపారు. అది సక్రమంగానే ఉందని టీడీపీ భావిస్తోందని చెప్పారు. ప్రతి ఎన్నికల్లో బీజేపీ గెలిచేందుకు జ్ఞానేశ్ కుమార్ను నియమించారన్న ఆరోపణలపై స్పందిస్తూ.. అలా అయితే కేరళం, తెలంగాణల్లో బీజేపీ ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు ఓటర్ల జాబితాలో ఉండటం చాలా ముఖ్యమన్నారు. సర్ ఒక నిర్దిష్ట విధానంలో జరగాలన్నదే మొదటి నుంచి తమ అభిప్రాయమని, అది ఎక్కడా మారలేదని చెప్పారు. వివిధ అంకాలపై ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే.. ఆయన మాటల్లోనే..
జెనోజీ గురించి.. యువత కోరుతున్న మార్పుపైన..
కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా దేశంలో ఓ కొత్త ఉద్యమం వస్తుందని భావిస్తున్నాను. ఇది జనరేషన్ మార్పు. వ్యవస్థను మార్చాలని భావిస్తున్న యువత ఉద్యమిస్తోంది. మా ప్రభుత్వంలో కూడా ఇంకా మెరుగుపరచాల్సిన అంశాలు ఉన్నాయి. నమస్యలను గుర్తించాం. యువతతో కలిసే వాటికి పరిష్కారాలు కనుగొనడం నాకు చాలా ఉత్సాహ్నాన్నిస్తుంది. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం విద్యతో ప్రారంభమవుతుంది. అందుకే మేము పాఠ్యాంశాలను పూర్తిగా పునఃపరిశీలిస్తున్నాం. పరిశ్రమలతో కలిసి ఉద్యోగాలు సృష్టిస్తున్నాం. ఏడాది కాలంలో దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వచ్చాయి. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు య-వతలో పెంచుతున్నాం. యువత మనోభావాలను మేం వింటున్నాం. విద్యార్థులతో ఓపెనా మాట్లాడతాను. ఇటీవల నర్సరావుపేటలో విద్యార్థులు క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సులు కావాలని అడిగారు. వారికోసం ఐబీఎంతో మాట్లాడి వారికి క్యాప్సుల్ కోర్సులు తీసుకొచ్చాం.
డీఎస్సీ విషయంలో ప్రతిపక్షం ఆరోపణలపై..
డీఎస్సీ పరీక్షను అత్యంత పారదర్శకంగా నిర్వహించాం. ఇది కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ప్రతివక్షం ఒక్క ఆరోపణ కూడా ఇప్పటి వరకు నిరూపించలేదు. గత ప్రభుత్వంలో క్రీడా కోటాలో ఎంపికైన విద్యార్థులకు అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలే సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇప్పుడు అదే అంశంపై ఆరోపణలు చేస్తున్నారు. క్రీడా కోటా అంశంపై వారు కోర్టుకు వెళ్లారు, సీబీఐ దర్యాప్తు కోరారు. మేము తప్పు చేయలేదు. కోర్టు ఏ ఆదేశం ఇచ్చినా దానికి సిద్ధంగా ఉన్నాం. దేశంలోని విద్యావ్యవస్థను పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉంది. ఏఐ నుంచి క్వాంటమ్ వరకు భవిష్యత్ టెక్నాలజీలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా మార్చాలన్న చంద్రబాబు ఆలోచన వాస్తవ రూపం దాల్చుతోంది. ఇక పెట్టుబడుల కోసం త్రిపుల్ఎస్ (స్పీడ్, సర్వీస్, స్టెబిలిటీ) మంత్రాన్ని అనుసరిస్తున్నాం. ప్రాజెక్ట్ ప్రతిపాదనలను క్లియర్ చేసే వేగంలో ఏపీ కొత్త ప్రమాణాలను పాటిస్తోంది. స్కైరూట్ వంటి సంస్థలు ఎక్కువ మందికి తెలియకముందే మేము వారిని ఏపీకి తీసుకురావడానికి ప్రయత్నించాం.
విద్యాశాఖ మంత్రిగా సాధించింది..
సమాజానికి పెద్ద స్థాయిలో సేవ చేయగలనని భావించి విద్యాశాఖను ఎంచుకున్నాను. గత ప్రభుత్వ హయాంలో 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైట్ పాఠశాలలకు వెళ్లారని గణాంకాలు చెబుతున్నాయి. గత రెండేళ్లలో 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు తిరిగి వచ్చారు. 16 వేల మంది ఉపాధ్యాయులను నియమించాం. మా ఉపాధ్యాయులు చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఇక మా జీఎస్టీ వృద్ధి దాదాపు రెండంకెల స్థాయిలో ఉంది. 17-18 శాతానికి పైగా వృద్ది నమోదు ఉంది. దీర్ఘకాలంలో అప్పులను తీర్చగలమనే నమ్మకం ఉంది. ఒక కుటుంబం పేదరికం నుంచి బయటపడిన తర్వాత ఇక సంక్షేమం అవసరం లేని స్థాయికి రావాలి. వారికి ఉద్యోగాలుండాలి. వారు తమ కుటుంబాలను తాము నిర్వహించుకోగలగాలి. అలాంటి సమాజాన్ని నిర్మించడమే లక్ష్యం.
సీఎం కావాలనుకుంటున్నారా..?
నేనెప్పుడూ ఉన్నత పదవులను ఆశించలేదు. ప్రజల హృదయాలను గెలుచుకోవాలనే లక్ష్యంతోనే పనిచేశాను. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి నాకు ప్రాధాన్యం కాదు. విద్యా వ్యవస్థను వీలైనంత త్వరగా మార్చడమే నా ప్రాధాన్యం. ఆ తర్వాత పార్టీని ముందుకు నడిపించడం ముఖ్యం. అందుకే మై టీడీపీ యాప్ ద్వారా రోజులో అధిక సమయం కార్యకర్తలతో టచ్లో ఉంటాను. నేను ఎప్పుడూ ఏబీసీ.. ఆల్వేస్ వీ క్లోజింగ్ అని నమ్ముతాను. ఎప్పుడూ ఒక అవకాశాన్ని ముగింపునకు తీసుకెళ్లాలి. క్రికెట్ మ్యాచ్కు వెళ్లినా.. అక్కడ కూడా పెట్టుబడి ఒప్పందాలపై మాట్లాడి వాటిని ముగిస్తాను. ఒక టీ20 మ్యాచ్లో నేను ఎంతమంది పారిశ్రామికవేత్తలను, వ్యాపారవేత్తలను కలిశానో చెవితే ఆశ్చర్యపోతారు. వారిలో చాలామంది తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టారు.