పచ్చని చెట్లు నరికేసిన నేలలోనే
నేడు ప్రగతి వనం 28 వేల మంది రైతులకు లబ్ధి:
డిప్యూటీ సీఎం పవన్ పచ్చని చెట్లు నరికిన నేలలోనే
నేడు ప్రగతి వనం: పవన్ కల్యాణ్ పల్లెపండుగ కింద
రెండేళ్లలో రూ.8 వేల కోట్ల అభివృద్ధి పనులు
మదనపల్లె సభలో డిప్యూటీ సీఎం వెల్లడి
మదనపల్లె, : కరుపుతో పోరాడిన రాయలసీమను ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. శుక్రవారం మదనపల్లెలో శుక్రవారం రాయలసీమ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ఐఎన్ఏ) శంకుస్థావన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రాయలసీమ గొప్ప చరిత్రకు, ప్రత్యేకమైన సంస్కృతికి, ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచిన నేలగా పేర్కొన్నారు. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన ఈ ప్రాంతం.. అనేక ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొందని.. ఫ్యాక్షన్ రాజకీయం ప్రభావంతో అశాంతికి గురైన నందర్భాలూ ఉన్నాయని.. అభివృద్ధికి ప్రతీకగా నిలవాల్సిన ప్రాంతంలో పచ్చని చెట్లను సైతం నరికేశారని గుర్తుచేశారు. వాటి నుంచి రాయలసీమను బయటకు తీసుకొచ్చి అభివృద్ధి బాటలో నడిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కృషి చేశారన్నారు. 2024లో ప్రజలిచ్చిన తీర్పే.. ఈ మార్పునకు మరింత బలాన్నిచ్చిందని.. ఈ రోజు రాయలసీమలో రూ. లక్ష కోట్ల పెట్టుబడులతో అభివృద్ధి కార్యక్రమాలకు బాటలు పడ్డాయని తెలిపారు. గత రెండేళ్లలో వల్లే పండుగ ద్వారా ఈ ప్రాంతంలో రూ.8 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. 62 వేల ఎకరాల్లో 28 వేలమంది రైతులకు లబ్ది కలిగేలా ఉద్యాన పంటల సాగును విస్తరించామని చెప్పారు. నీటి సంరక్షణకు దాదాపు 70 వేల వంట కుంటలు నిర్మించి అదనంగా 50 వేల ఎకరాలను సాగులోకి తెచ్చామన్నారు.రూ.4500 కోట్లతో 23 వేలకుపైగా రహదారి పనులు చేపట్టి 5 వేల కిలోమీటర్లకు పైగా రోడ్ల నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. ఉపాధి హామీ నిధులతో ప్రాజెక్టు జలధార ద్వారా నీటి సంరక్షణ చర్యలు బలోపేతం చేస్తూ రాయలసీమను నీటి భద్రత కలిగిన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామని.. దీంతో ఈ ప్రాంతంలో భూగర్భజల మట్టం నగటున 3.6 మీటర్లు పెరిగిందని వివరించారు.
అనంత్ అంబానీకి కృతజ్ఞతలు
రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించడంతోపాటు డిజిటల్ అగ్రికల్చర్, ప్రెసిషన్ ఫార్మింగ్, క్రాప్ మానిటరింగ్, స్మార్ట్ ఇరిగేషన్ ఫార్మింగ్, మార్కెట్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక విధానాలను వ్యవసాయ రంగంతో అనుసంధానం చేయడంలో ఐఎస్ఎ కీలకంగా ఉంటుందని పవన్ చెప్పారు. 'ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టులో పాలుపంచుకోవడానికి, ఐఎస్ఏ ఏర్పాటుకు మద్దతిచ్చినందుకు అనంత్ అంబానీకి ఆంధ్ర ప్రజల తరపున కృతజ్ఞతలు' అని అన్నారు.