ఈ నెల 19 నుంచి 27 వరకు ఉమెన్ ఏపీఎల్
పోటీలు ప్రారంభోత్సవానికి నారా బ్రాహ్మణి హాజరు
ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం.. విద్యార్థుల కోసం
ప్రత్యేక బస్సుల ఏర్పాటు వచ్చే సీజన్ నుంచి విశాఖ,
కడవలోనూ ఉమెన్ ఏపీఎల్ మ్యాచ్‌లు ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని )
విజయవాడ స్పోర్ట్స్, : మహిళా క్రికెట్‌ను ప్రోత్సహించడంతో పాటు యువ క్రీడాకారిణులకు మరిన్ని అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమెన్ ఏపీఎల్ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఏసీఏ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. నగరంలోని ఏసీఏ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఉమెన్ ఏపీఎల్ పోటీలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ నెల 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు పోటీలు జరుగుతాయని తెలిపారు. ఉమెన్ ఏపీఎల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నారా బ్రాహ్మణి హాజరుకాసున్నారని కేశినేని శివనాథ్ వెల్లడించారు. మహిళా క్రికెట్‌కు ప్రోత్సాహం అందించడంతో పాటు ప్రతిభావంతులైన క్రీడాకారిణులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు వేదిక కల్పించడమే ఉమెన్ ఏపీఎల్ ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రస్తుత సీజన్లో నాలుగు జట్లు పోటీపడుతున్నాయని, ఈ సీజన్లో అన్ని మ్యాచ్‌లను మంగళగిరి స్టేడియంలోనే నిర్వహించనున్నట్లు తెలిపారు. క్రికెట్ అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో మ్యాచ్‌లను వీక్షించేలా ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా విద్యార్థుల్లో మహిళా క్రికెట్‌పై ఆసక్తిని పెంపొందించేందుకు విజయవాడ నుంచి విద్యార్థులను మంగళగిరి స్టేడియానికి తీసుకెళ్లేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉమెన్ ఏపీఎల్ కేవలం క్రికెట్ పోటీల నిర్వహణకే పరిమితం కాకుండా, మహిళా క్రీడాకారిణులకు అవకాశాలు కల్పించడం ద్వారా మహిళా సాధికారతకు దోహదపడే కార్యక్రమంగా ముందుకు తీసుకువెళ్తామని కేశినేని శివనాధ్ తెలిపారు. రాబోయే రోజుల్లో ఉమెన్ ఏపీఎల్‌ను మరింత విస్తరించనున్నామని, వచ్చే సీజన్ నుంచి విశాఖపట్నం, కడవలో కూడా మ్యాచ్‌లు నిర్వహించేం దుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మహిళా క్రికెట్‌కు సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా వనిచేస్తున్నామని తెలిపారు. ఉమెన్ ఏపీఎల్ పోటీలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు గురువారం సాయంత్రం విజయవాడ నుంచి మంగళగిరి వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు కేశినేని శివనాథ్ తెలిపారు. క్రీడాభిమానులు, యువత, విద్యార్థులు, ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. మహిళా క్రికెట్‌కు ప్రజల నుంచి మరింత ఆదరణ లభించేలా ఉ మెన్ ఏపీఎల్‌ను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏసీఏ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ కళ్యాణ్ కృష్ణ, సీఏఓ జై కిషన్ పాల్గొన్నారు.