మధ్యంతర ఎన్నికల వేళ ఓటర్ల జాబితాల వివాదం
అధ్యక్షుడు ట్రంప్, న్యాయశాఖపై డెమోక్రాట్ల కేసు
నెవాడాలో డేటాపై ప్రశ్నలు
కాలిఫోర్నియాతో న్యాయశాఖ వివాదం
వాషింగ్టన్: అమెరికాలోనూ ఓటర్ల అంశం వివాదాస్పదం అవుతోంది. మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితాల నుంచి అనుమానిత విదేశీయుల పేర్లను తొలగించే ప్రయత్నాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా న్యాయశాఖపై డెమోక్రటిక్ పార్టీ నేతలు కోర్టును ఆశ్రయించారు. ఈ చర్యలు ఎన్నికలపై ప్రజల్లో విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయని వారు ఆరోపించారు. కాలిఫోర్నియా. నెవాడా వంటి రాష్ట్రాల్లో పౌరసత్వంపై అనుమానాలున్న ఓటర్ల మెయిల్ ద్వారా వేసిన వేలాది ఓట్లను పక్కన పెట్టాలని ట్రంప్ ప్రభుత్వం కోరడాన్ని డెమోక్రాట్లు సవాలు చేశారు. ఇందుకు ఉపయోగిస్తున్న కేంద్ర ప్రభుత్వ డేటా నాణ్యత లోపభూయిష్టంగా ఉందని, అందులో తరచూ తప్పులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. డెమోక్రటిక్ సెనేట్, ప్రతినిధుల సభ ఎన్నికల ప్రచార కమిటీలతో పాటు ఇతర సంస్థలు మంగళవారం వాషింగ్టన్లో ఈ పిటిషన్ దాఖలు చేశాయి. రాష్ట్రాల ఎన్నికల నిర్వహణ అధికారాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని, రాజ్యాంగంలోని అధికారాల విభజన సూత్రాన్ని ఉల్లంఘిస్తోందని వారు వాదించారు.
నెవాడాలో డేటాపై ప్రశ్నలు
నెవాడాలో దాదాపు 16 వేల మంది పౌరసత్వం లేని వ్యక్తులు ఓటర్ల జాబితాలో ఉన్నట్లు తొలుత హోంల్యాండ్ మద్యాం & విభాగం పేర్కొందని డెమోక్రాట్లు తెలిపారు. అయితే సంఖ్యను ఆ తర్వాత 185 మందికి తగ్గించారు అని ఆరోపించారు. వారు కూడా అమెరికా పౌరులేనని రాష్ట్ర అధికారులు సూచించినప్పటికీ, ప్రభుత్వం తన వాదనకు ఆధారాలు చూపలేకపోయిందని వీటిషన్ లో పేర్కొన్నారు.
కాలిఫోర్నియాతో న్యాయశాఖ వివాదం
అనుమానిత విదేశీ ఓటర్లను గుర్తించి తొలగించేప్రయత్నంలో సహకరించలేదని ఆరోపిస్తూ అమెరికా న్యాయశాఖ గత వారం కాలిఫోర్నియా రాష్ట్రం పై కేసు వేసింది. రాష్ట్రంలోని సుమారు 20 వేల వివాదాస్పద మెయిల్ బ్యాలెట్లను పౌరసత్వం నిర్ధారణ అయ్యే వరకు వక్కన పెట్టాలని కోర్టును కోరింది. అయితే, ఆక్రమ ఓటింగ్స్ నిరోధించేందుకు ఇప్పటికే రాష్ట్ర చట్టాలు ఉ న్నాయని, కేంద్ర ప్రభుత్వ అభ్యర్ధన వాటిలో జోక్యం చేసుకుంటోందని పేర్కొంటూ కాలిఫోర్నియా మంగళవా రం ఆ అభ్యర్ధనను తిరస్కరించాలని న్యాయ మూర్తిని కోరింది. మధ్యంతర ఎన్నికల్లో తమ మెజారిటీని నిలబెట్టు కోవాలని రిపబ్లికన్ పార్టీ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ వివాదం ప్రాధాన్యం సంతరించుకుంది.