విజయవాడ ఉత్సవ్, నేషనల్ సరస్ మేళాకు ఘనంగా ఏర్పాట్లు
18 ఎకరాల పున్నమి ఘాట్‌లో సాంస్కృతిక సంబరాలు
భక్తులు, పర్యాటకులు ఉత్సవాలను ఆస్వాదించేలా ప్రణాళికలు
ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)
విజయవాడ, : దసరా నవరాత్రుల సందర్భంగా భక్తులు, పర్యాటకులు, కళాభిమానులను ఆకట్టుకునేలా విజయవాడ ఉత్సవ్, జాతీయ సరస్ మేళాలను ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్లమెంట్ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. నగరంలో తన కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దసరా ఉత్సవాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు నగరానికి తరలివస్తారని, దుర్గమ్మ ఆశీస్సులతో విజయవాడ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గతేడాది విజయవాడ ఉత్సవ్న ఘనంగా నిర్వహించామని, ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు లక్షలాది మంది ప్రజలు ఉత్సవాల్లో పాల్గొన్నారని గుర్తుచేశారు. ఈ ఏడాది దేవీ నవరాత్రుల సందర్భంగా అక్టోబర్ 11 నుంచి 20 వరకు విజయవాడ ఉత్సవ్న నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 8 నుంచి 23 వరకు సరస్ మేళా కొనసాగుతుందని చెప్పారు. పున్నమి ఘాట్ పరిధిలో 18 ఎకరాల స్థలంలో విజయవాడ ఉత్సవ్, సరస్ మేళాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, మాకినేని బసవపున్నయ్య స్టేడియంలోనూ పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. విజయవాడను సాంస్కృతిక, కళల రాజధానిగా మరోసారి చాటిచెప్పేలా ఉత్సవాలను నిర్వహిస్తామని, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఆయా రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సరన్ మేళా, విజయవాడ ఉత్సవ్, అమ్మవారి దర్శనాన్ని ఒకే పర్యటనలో ఆస్వాదించేలా సందర్శకుల కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని, ఉదయం కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని సాయంత్రం ఉత్సవాల్లో పాల్గొనేలా రెండు రోజుల షెడ్యూల్‌ను ముందుగానే రూపొందించుకోవాలని సూచించారు. విజయవాడ ఉ త్సవ్‌లో పది రోజుల పాటు వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారుల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వివిధ ప్రాంతాల రుచులను పరిచయం చేసే ఫుడ్ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మైసూరు ఏనుగులను విజయవాడకు తీసుకువచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని వెల్లడించారు. ఉత్సవాల నిర్వహణను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలను సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారని తెలిపారు. భక్తులు, నందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రవాణా, భద్రత, పారిశుధ్యం, తాగునీరు తదితర ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ నెల 28న అంబేడ్కర్ కళా వేదికలో విజయవాడ ఉత్సవ్ కర్టన్ రైజర్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉ త్సవాల్లో నిర్వహించనున్న వివిధ కార్యక్రమాలను మంత్రులు, అధికారులు వివరించనున్నారని చెప్పారు. విజయవాడ ఉత్సవ్‌ను ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా దాతలు, సంస్థలు, వివిధ వర్గాల నహకారంతో నిర్వహించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని, భవిష్యత్‌లో స్వయం సమృద్ది మోడల్లో నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని కేకినేని చిన్ని తెలిపారు. ప్రజలు, మీడియా నుంచి వచ్చే సూచనలు, సలహాలను స్వీకరించి ఉత్సవాలను మరింత మెరుగ్గా నిర్వహిస్తామని చెప్పారు. విజయవాడకు వచ్చే భక్తులు, పర్యాటకులు ఆధ్యాత్మికతతో పాటు కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆహార వైవిధ్యాన్ని ఆస్వాదించేలా ఉత్సవాలను రూపొందిస్తున్నామని తెలిపారు.