పున్నమి ఘాట్‌లో భూమి పూజ.. బసవపున్నయ్య స్టేడియంలోనూ వేడుకలు
8 నుంచి 9 రాష్ట్రాల ముఖ్యమంత్రుల రాకకు ఏర్పాట్లు
రాష్ట్రపతి, ప్రముఖ పారిశ్రామికవేత్తల హాజరుకు అవకాశం
విజయవాడ, : నగరంలో నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్ 2.0కు మంగళవారం పున్నమి ఘాట్‌లో భూమి పూజ నిర్వహించారు. టీడీపీ వశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి బుద్ధా వెంకన్న కల్చరల్ కార్పొరేషన్ చైర్మన్ తేజస్వి బిల్డింగ్స్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, గన్నె ప్రసాద్, విజయవాడ ఉత్సవ కమిటీ ప్రతినిధి దండమూడి శ్రీనివాస్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ 2025లో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఆధ్వర్యంలో విజయవాడ ఉ త్సవు రూపకల్పన జరిగిందన్నారు. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో ప్రముఖులు, ప్రజల భాగస్వామ్యంతో గత ఏడాది నిర్వహించిన ఉత్సవానికి విశేష స్పందన లభించిందని తెలిపారు. గత ఉత్సవాల విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇదే తరహా ఉత్సవాలను నిర్వహించాలనే ఆలోచనకు ప్రభుత్వం, ప్రజలు వచ్చారని పేర్కొన్నారు. గత ఉత్సవాల్లో దేశ ఉపరాష్ట్రపతితో పాటు పలువురు ప్రమ-Jఖులు పాల్గొన్నారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత నారా లోకేష్ సలహాలు, సూచనలతో ఈసారి విజయవాడ ఉత్సవ్‌ను మరింత ఘనంగా నిర్వహించేం దుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పున్నమి ఘాట్‌తో పాటు బసవవున్నయ్య స్టేడియంలోనూ ఉత్సవకార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా 8 నుంచి 9 రాష్ట్రాల ముఖ్య మంత్రులు విజయవాడ ఉత్సవ్‌కు హాజరుకాను న్నారని వెల్లడించారు. అక్టోబర్ 14న రాష్ట్రపతి విజయవాడకు రానున్నారని, దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా నగరానికి విచ్చేయనున్నారని తెలిపారు. దనరా శరన్నవరాత్రి ఉత్సవాలతో పాటు విజయవాడ ఉత్సవ్ 2.0ను అత్యంత వైభవంగా నిర్వహించి నగర ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పేలా ఏర్పాట్లు చేస్తున్నామని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు.