రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం
విజయవాడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వైభవాన్ని, విజయవాడ ఉత్సవ్ 2.0 ప్రత్యేకతలను వివరించిన ప్రజాప్రతినిధులు
జాతీయ స్థాయిలో విజయవాడ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని చాటేలా ఉత్సవ నిర్వహణ
ఢిల్లీ, : విజయవాడలో నిర్వహించనున్న దనరా శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0కు జాతీయ స్థాయి ప్రముఖులను ఆహ్వానించే కార్యక్రమం కొనసాగుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కలిసి ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, సానా సతీష్ బాబు ఆహ్వానించారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అమిత్ షాతో పాటు ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌ను కూడా ప్రజాప్రతినిధులు కలిసి ఆహ్వాన పత్రికలు అందించారు. తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి, బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ను కూడా ఆహ్వానించారు. ఈ సందర్భంగా విజయవాడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వైభవం, విజయవాడ ఉత్సవ్ 2.0 ప్రత్యేకతలు, నగర ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక ప్రాధాన్యతను వారికి వివరించారు. వివిధ రాష్ట్రాల ప్రజలను ఉత్సవాల్లో భాగస్వాములను చేయడంతో పాటు విజయవాడ ప్రత్యేకతను జాతీయ స్థాయిలో చాటేలా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.