టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 మూవీపై ఆడియన్స్ లో ఇప్పటికే హైప్ నెలకొంది. టీజర్ తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సినిమాపై అంచనాలు పెంచిన టీమ్.. ఇప్పుడు ఫస్ట్ సింగిల్ నారాయణమ్మతో మాస్ టచ్ చూపించింది, నారాయణమ్మ అంటూ సాగే ఆ సాంగ్ ను లేటెస్ట్ గా మూవీ టీమ్ రిలీజ్ చేసింది. తమన్ స్వరాలు సమకూర్చిన ఆ పాటను ప్రభ, రామ్ మిరియాల ఎనర్జిటిక్ గా ఆలపించారు. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. పాటను చూస్తుంటే ఫెస్టివల్ ఎన్విరాన్మెంట్ ను తలపించేలా సందడిగా షూట్ చేసినట్లు కనిపిస్తోంది. అయితే ఆ సాంగ్ లో వెంకటేష్‌తో పాటు ముగ్గురు హీరోయిన్లు సందడి చేశారు. శ్రీనిధి శెట్టి, డింపుల్ హయాతి, నివేదా పేతురాజ్ తమ డ్యాన్స్ తో పాటకు మరింత జోష్ తీసుకొచ్చారు. ముఖ్యంగా డింపుల్ హయాతి తన వైబ్రెంట్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నారని చెప్పాలి. వెంకీ మామ కూడా ముగ్గురు బ్యూటీలతో కలిసి స్టెప్పులు వేయడం సాంగ్ కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక నారాయణమ్మ పాట రెగ్యులర్ పార్టీ సాంగ్ తరహాలో సాగుతుంది. తమన్ ఇచ్చిన బీట్ కు తగ్గట్టుగా వెంకటేష్, హీరోయిన్ల డ్యాన్స్ ప్లాన్ చేశారు.