యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం లాక్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఎన్టీఆర్ –డ్రాగన్- షూటింగ్ పూర్తి చేసిన అనంతరం -గాడ్ ఆఫ్ వార్ షూట్ లో నే పాల్గొంటారు? అన్నది అధికారిక సమాచారం. అటు గురూజీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాపై కొత్త సందేహాలు చక్కర్లు కొడుతున్నాయి. వివరాల్లోకి ఇక వెళ్తే ఇటీవలే త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన -ఆదర్శకుటుంబం- రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇది రెగ్యులర్ స్టోరీ. ఓ కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ అంచనాలు మాత్రం అనుకున్న విధంగా అందుకోలేదు. అటు -గాడ్ ఆఫ్ వార్ అన్నది భారీ పాన్ ఇండియా చిత్రం. త్రివిక్రమ్ కి ఇదే తొలి పాన్ ఇండియా చిత్రం. దాదాపు500 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందించాల్సిన కథ. ఇలాంటి కథను ఎన్టీఆర్ తో గురూజీ ఎలా డీల్ చేస్తారు? అన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకూ త్రివిక్రమ్ తెరకెక్కించిన సినిమాల శైలి వేరు. అతడు తీసిన కుటుంబం కథలు.. స్టార్ ఇమేజ్.. అతడి డైలాగ్ పవర్ తో సినిమాలు ఆడాయి. కానీ గాడ్ ఆఫ్ వార్ అన్నది పాన్ ఇండియా సినిమా. పైగా మైథలాజికల్ కాన్సెప్ట్. ఇలాంటి ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కించిన అనుభవం గురూజీకి లేదు. దీంతో పాటు బడ్జెట్ కూడా వందల కోట్లు వెచ్చించాల్సి వస్తుంది. అలాగే ఎన్టీఆర్ పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టి లో పెట్టుకుని తీయాల్సిన సినిమా. డ్రాగన్ రిలీజ్ అనంతరం హిట్ అయితే తారక్ ఇమేజ్ అంతకంతకు రెట్టింపు అవుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని గాడ్ ఆఫ్ వార్ ని గురూజీ డీల్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రారంభం కావడానికి మరింత సమయం పడుతుందనే కొత్త ప్రచారం తెరపైకి వస్తుంది.