సముద్రంలో తేలియాడుతున్న ఐఫోన్లు
ఇరాన్ దాడులు తీవ్రతరం.. 48 గంటల్లో ఐదు ఘటనలు
టెహరాన్: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ హార్ముజ్ జలసంధి సమీపంలో రెండు కంటైనర్ నౌకలు క్షిపణి దాడులకు గురై సముద్రంలో మునిగిపోయాయి. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత వాణిజ్య నౌకలపై దాడులు ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారని అంతర్జాతీయ నివేదికలు పేర్కొన్నాయి. కీలకమైన హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలను పూర్తిగా అడ్డుకోవడం ద్వారా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఒత్తిడి పెంచేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో నవంబరు 3న జరగనున్న మధ్యంతర ఎన్నికలకు ముందు ఇంధన ధరలను తగ్గించేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో.. ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకు న్నాయి. హార్ముజ్ ప్రాంతంలో గత 48 గంటల్లో ట్యాంకర్లు సహా వాణిజ్య నౌకలపై డ్రోన్ దాడులతో కలిపి కనీసం 5 ఘటనలు చోటుచేసుకున్నట్లు బ్రిటన్‌కు చెందిన యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (యూకేఎంటీఓ) బుధవారం వెల్లడించింది.
మైనన్ను ఢీకొని మునిగిందన్న ఇరాన్
సింగపూర్ జెండాతో ప్రయాణిస్తున్న జీఎఫ్ఎస్ ప్రైడ్ అనేకం టైనర్ నౌక మంగళవారం దాడికి గురికాగా.. బుధవారం నముద్రంలో మునిగిపోయింది. కొన్ని గంటల తర్వాత ఆంటిగ్వా, బార్బుడా జెండాతో ప్రయాణిస్తున్న కేప్ దావో నౌక కూడా జలసంధికి సమీపంలో మునిగింది. జీఎఫ్ఎస్ ప్రైడ్ ఘటనను ఉద్దేశిస్తూ ఇరాన్ మరో వాదనను తెరపైకి తెచ్చింది. అనుమతి లేని మార్గంలో హార్ముజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నించిన నమయంలో ఆ నౌక సముద్రంలో అమర్చిన నావికా మందుపాతరను ఢీకొని మునిగిపోయిందని పేర్కొంది. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ప్రసారం చేసిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్డీసీ) ప్రకటనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి, ప్రమాద సమయంలో నౌక ఒకవైపునకు ఒరిగిపోయి, దట్టమైన పొగ వెలువడుతున్న దృశ్యాలను ప్రసారం చేశారు. ఆ నౌకలో 2,500 కంటైనర్లు ఉన్నట్లు సమాచారం. కంటైనర్ల నుంచి బయటకు వచ్చిన ఐఫోన్లు, పెర్ఫ్యూం బాటిళ్ల బాక్సులు సముద్రంపై భారీగా తేలియాడాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి గురువారం వెలుగులోకి వచ్చింది