రాయలసీమ, అమరావతి, గోదావరి జట్ల మధ్య ఫైనల్
బెర్త్ కోపం ఉత్కంఠ.. నేటితో ముగియనున్న టోర్నమెంట్ లీగ్ షెడ్యూల్
మంగగిరి, : మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూఏపీఎల్)లో పర్షం మరోసారి మ్యాచ్‌లకు అంతరాయం కలిగించింది. టోర్నమెంట్ రెండో రోజు జరగాల్సిన రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. దీంతో ఆయా మ్యాచ్‌ల్లో తలపడాల్సిన జట్లకు చెరో పాయింట్ లభించింది. తొలి మ్యాచ్‌లో వైజాగ్ ఫైర్ బర్డ్స్--రాయలసీమ జెన్ స్టార్స్ జట్లు తలపడాల్సి ఉండగా, ఎడతెరిపిలేని వర్షం కారణంగా మ్యాచ్ నిర్వహణకు అవకాశం లేకపోయింది. పరిస్థితులను పరిశీలించిన అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. సాయంత్రం వర్షం కొంతసేవు విరామం ఇవ్వడంతో అమరావతి ఈ ఛాంపియన్స్--గోదావరి గోల్డెన్ ఈగల్స్ మధ్య రెండో మ్యాచ్‌ను నిర్వహించేందుకు నిర్వాహకులు, గ్రౌండ్ సిబ్బంది ప్రయత్నించారు. కనీనం ఐదు ఓపర్ల మ్యాచ్ అయినా నిర్వహించవచ్చని భావించినప్పటికీ, కవర్లు తొలగించే సమయంలో మరోసారి వర్షం ప్రారంభం కాపడంతో గ్రౌండ్ పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో అంపైర్లు రెండో మ్యాచ్‌ను కూడా రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. దీంతో డబ్ల్యూఏపీఎల్‌లో ప్రతి జట్టుకు ఐదు లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. రేపు చివరి లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం వైజాగ్ ఫైర్ బర్డ్స్--గోదావరి గోల్డెన్ ఈగల్స్, సాయంత్రం రాయలసీమ జెన్ స్టార్స్--అమరావతి ఈ ఛాంపియన్స్ తలపడనున్నాయి. చివరి లీగ్ మ్యాచ్‌లకు ముందు ఫైనల్ బెర్త్ కోసం రాయలసీమ జెన్ స్టార్స్, అమరావతి ఈ ఛాంపియన్స్, గోదావరి గోల్డెన్ ఈగల్స్ మధ్య పోటీ నెలకొంది. రాయలసీమ, అమరావతి జట్లు ఐదు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక ఓటమి, రెండు ఫలితం లేని మ్యాచ్‌లతో నమాన పాయింట్లతో ఉన్నాయి. గోదావరి గోల్డెన్ ఈగల్స్ కూడా ఇదే రికార్డు. అయితే నెట్ రన్రెట్లో రాయలసీమ, అమరావతి జట్లు గోదావరి కంటే మెరుగ్గా ఉండటంతో ప్రస్తుతం తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. రేపటి చివరి లీగ్ మ్యాచ్‌లు ఫైనల్ బెర్తను నిర్ణయించడంలో కీలకం కానున్నాయి. వర్షం కారణంగా మ్యాచ్‌లు రద్దయితే లీగ్ దశలో సాధించిన విజయాలు, నెట్ రన్రె రేట్ వంటి నిబంధనల ఆధారంగా టాప్-2 జట్లను నిర్ణయించనున్నారు. మ్యాచ్‌లు సజావుగా జరిగితే సమీకరణాలు మారే అవకాశం ఉంది. ముఖ్యంగా రాయలసీమ, అమరావతి, గోదావరి జట్లలో ఏ రెండు జట్లు ఫైసల్‌కు చేరతాయన్నది చిపరి లీగ్ మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ఫైనల్ మ్యాచ్ ఈ నెల 27న జరగనుండగా, ఆ రోజు కూడా వర్షం ఆటంకం కలిగిస్తే షెడ్యూల్లో పేర్కొన్న వివరాల ప్రకారం రిజర్వ్ డే రోజున మ్యాచ్ నిర్వహించనున్నారు.