చంద్రశేఖరన్ ను మరో ఐదేళ్లు
చైర్మన్ గా నియమించిన టాటా సన్స్ బోర్డు కంపెనీ
షేర్ల లిస్టింగ్‌కు సైతం ఆమోదం
ఆ తీర్మానం చెల్లదంటున్న టాటా ట్రస్ట్‌లు
కోర్టును ఆశ్రయించనున్న నోయల్ టాటా!?
ముంబై: దేశంలో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యమైన టాటా గ్రూప్ లో ముసలం ముదురుతోంది. గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్, దాని ప్రమోటర్లైన టాటా ట్రస్ట్‌ల మధ్య ఏడాదికి పైగా కొనసాగుతున్న విభేదాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. గురువారం ముంబైలోని టాటా సన్స్ ప్రధాన కార్యాలయం (బాంబే హౌస్) లో దాదాపు 3 గంటల పాటు సమావేశమైన కంపెనీ బోర్డు సభ్యులు తీసుకున్న అనూహ్య నిర్ణయాలే ఇందుకు కారణం. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పునర్నియామకాన్ని కోరుకోవడం లేదని ఇదివరకే ప్రకటించిన నటరాజన్ చంద్రశేఖరన్‌కు కంపెనీ బోర్డు మరో ఐదేళ్లు సారథ్య బాధ్యతలు కట్టబెట్టింది. చంద్రను అభ్యర్థించి, ఒప్పిం చి మరీ మూడోసారి చైర్మన్‌గా నియమించింది. అంతేకాదు ఆర్ బీ ఐ మార్గదర్శకాలకు కంపెనీ షేర్లు మార్కెట్లో నమోదు చేయాలని కూడా బోర్డు నిర్ణయించింది. అయితే, టాటా ట్రస్ట్‌ల చైర్మన్, టాటా సన్స్ బోర్డు సభ్యుల్లో ఒకరైన నోయల్ టాటా ఈ రెండు నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. బోర్డు సమావేశంలో చంద్రను చైర్మన్ గా పునర్ నియమించాలన్న తీర్మానానికి వ్యతిరేకంగా నోయల్ ఓటు వేశారు. అయితే, మెజారిటీ (నలుగురు) సభ్యుల అనుకూల ఓటింగ్ ఈ తీర్మానానికి ఆమోదం లభించింది. కానీ, ఈ తీర్మానం చట్ట విరుద్ధమని, చెల్లుబాటు కాదంటూ నోయల్ సారథ్యంలోని టాటా ట్రస్ట్‌లు వెంటనే ప్రకటన విడుదల చేశాయి. కాగా బోర్డు తాజా నిర్ణయాలను నోయల్ కోర్టులో నవాలు చేసే అవకాశముంది.
టాటా ట్రస్ట్‌లు చెబుతున్న కారణమిది..
చంద్రశేఖరనన్ను మూడోసారిగా చైర్మన్ గా నియమిస్తూ టాటా సన్స్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని నోయల్ నేతృత్వంలోని టాటా ట్రస్ట్‌లు వ్యతిరేకించాయి. చైర్మన్ చేసిన ప్రకటన ఆయన సొంత నిర్ణయమని, అందులో పునర్నియామకం కోరుకోవట్లేదని ఈ ఆగస్టులో చంద్ర బోర్డు ప్రమేయం లేదన్నాయి. చంద్ర నిర్ణయాన్ని అంగీకరించడంతోపాటు టాటా సన్స్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ (ఏఓఏ) ప్రకారంగా కొత్త చైర్మన్ నియామకం కోసం ప్రత్యేక కమిటీని సైతం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. అంతేకాదు, చంద్ర వునర్నియామకం కోసం ఓటింగ్ ద్వారా జరిగిన తీర్మానం చట్టబద్ధంగా చెల్లుబాటు కాదని కూడా టాటా ట్రస్ట్‌లు వాడిస్తున్నాయి. ఎందుకంటే, టాటా ట్రస్ట్‌ల తరఫున టాటా స్క్రీన్స్ బోర్డులో నియమించిన ఇద్దరు డైరెక్టర్లు అవుతుందన్నది నోయల్ వాదన. టాటా ట్రస్ట్‌లు నామినేట్ చేసిన బోర్డు సభ్యుల్లో ఒకరైన నోయల్ టాటా పునర్ నియామకాన్ని వ్యతిరేకించగా.. మరో సభ్యుడు వేణు శ్రీనివాసన్ మాత్రం అనుకూలంగా ఓటు వేశారు. ఈ విషయంపై తమ వాదనను బలపరుస్తున్న సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అభిప్రాయాన్ని కూడా టాటా సన్స్‌కు బోర్డుకు నోయల్ సమర్పించడం జరిగిందని, కానీ బోర్డు ఆ అభిప్రాయాన్ని పట్టించుకోలేదని టాటా ట్రస్టులు తమ ప్రకటనలో పేర్కొన్నాయి.
వేణు శ్రీనివాసన్ ను అడ్డుకునే ప్రయత్నం
చంద్ర పునర్ నియామకం కోసం జరిగిన ఓటింగ్‌తో పాటు. టాటా సన్స్ లిస్టింగ్‌పై నిర్ణయంతో పాలుపంచుకోవద్దని శ్రీనివాసనన్ను టాటా ట్రస్ట్‌లు బుధవారము కోవద్దని వేఅయితే, శ్రీనివాసన్ మాత్రం ట్రంస్టైల నిర్దేశాలను తోసిపుచ్చి టాటా సన్స్ బోర్డు సమావేశంలో చంద్ర పునర్నియామకంతో పాటు లిస్టింగ్‌ను బలపరిచారు. కంపెనీ ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు తీసుకోవడం సభ్యుడిగా తన బాధ్యతని శ్రీనివాసన్ ట్రస్ట్‌లకు గట్టిగా జవాబిచ్చారు.