వైజాగ్ ఫైర్ బర్డ్స్్ప గోల్డెన్ ఈగల్స్ విజయం
అమరావతి ఈ ఛాంపియన్సు ఓడించిన జెన్ స్టార్స్.. ఈ నెల 27న టైటిల్ పోరు
మంగళగిరి: ఉమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూఏపీఎల్)లో టైటిల్ పోరుకు రంగం సిద్ధమైంది. సెమీఫైనల్ మ్యాచ్ ల్లో అద్భుత విజయాలు సాధించిన గోదావరి గోల్డెన్ ఈగల్స్, రాయలసీమ జెన్ స్టార్స్ ఫైనల్ కు చేరుకున్నాయి. శుక్రవారం జరిగిన తొలి కీలక మ్యాచ్‌లో గోదావరి గోల్డెన్ ఈగల్స్ 27 పరుగుల తేడాతో వైజాగ్ ఫైర్ బర్డ్స్ పై విజయం సాధించగా, మరో సెమీఫైనల్లో రాయలసీమ జెన్ స్టార్స్ 32 పరుగుల తేడాతో అమరావతి ఈ ఛాంపియన్సు ఓడించి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. వైజాగ్ ఫైర్ బర్డ్స్‌తో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గోదావరి గోల్డెన్ ఈగల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 156 పరుగులు చేసింది. పుష్పిత 56 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 91 పరుగులు చేసి జట్టు భారీ స్కోరుకు బాటలు వేశారు. కెప్టెన్ హెన్రీట్టా పెరీరా 34 పరుగులతో సహకరించారు. 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వైజాగ్ ఫైర్ బర్డ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 129 పరుగులకే పరిమితమైంది. శ్రీష్టి శేఖర్ రెండు వికెట్లు తీయగా, వైష్ణవి, హారిక, అక్షయ తలా ఒక వికెట్ పడగొట్టారు. అద్భుత బ్యాటింగ్ 91 పరుగులు చేసిన పుష్పితకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మరోవైపు అమరావతి ఈ చాంపియన్స్ జరిగిన సెమీఫైనల్లో రాయలసీమ కెన్ స్టార్స్ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసింది. ఈ. పద్మజ 29 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 61 పరుగులు చేయగా, సేతు సాయి 81, వాసవి 29 పరుగులు చేశారు. 173 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన అమరావతి ఈ ఛాంపియన్స్ 19.1 ఓవర్లలో 110 వరుగులకు ఆలౌ టైంది. దీక్ష కాట్రగడ్డ 42, కాండ్రేగుల దేవిక 39 పరుగులతో రాణించినప్పటికీ మిగతా బ్యాటర్లు నిలదొక్కుకోలేకపోయారు. రాయలసీమ బౌలర్లలో వాసవి నాలుగు వికెట్లతో సత్తా చాటగా, ఈ. పద్మజ, బి. అనూష చెరో రెండు వికెట్లు తీశారు. బ్యాటింగ్‌లో 61 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో ఒక వికెట్ సాధించిన ఈ. పద్మజకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. రెండు సెమీఫైనల్స్‌లోనూ ప్రత్యర్థులను సమర్థంగా నిలువరించిన గోదావరి గోల్డెన్ ఈగల్స్, రాయలసీమ జెన్ స్టార్స్ ఇప్పుడు డబ్ల్యూఏపీఎల్ టైటిల్ కోసం తలవడసున్నాయి. ఈ నెల 27న జరగనున్న ఫైసల్లో రెండు జట్లు పోటీపడటంతో మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ విజేత ఎవరనే ఉత్కంఠ నెలకొంది.