ఢిల్లీలోని సెంట్రల్ పార్కు మూసేసినా
దూసుకొచ్చిన నిరసనకారులు
జాతీయ జెండాలతో వేలాదిగా
తరలివచ్చిన విద్యార్థులు,
ఆప్, వామపక్ష శ్రేణులు..
దీప్కే నేహా బోరా సహా 150 మంది
అరెస్టు త్రివర్ణ పతాకం పాకిస్థాన్‌లో ఎగరేయాలా?:
కేజీవాల్ అణచివేత చర్యలు అప్రకటిత
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పిలుపునిచ్చిన తిరంగా ర్యాలీతో ఢిల్లీలోని కన్నాట్స్ సెంట్రల్ పార్కు శుక్రవారం తీవ్ర ఉద్రిక్తతలకు, నిరసనలకు వేదికైంది. ర్యాలీని భగ్నం చేసేందుకు ఢిల్లీ పోలీసులు కఠిన ఆంక్షలు విధించినా ఆందోళనకారుల ముందు అవి నిలవలేకపోయాయి. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను ముందుగానే నిర్బంధించి, సెంట్రల్ పార్కును మూసివేసినా.. దాదాపు 7 వేల మంది విద్యార్థులు, విపక్షాల కార్యకర్తలు అక్కడికి చేరుకుని త్రివర్ణ పతాకాలతో ప్రదర్శన నిర్వహించారు. గత మంగళవారం జంతర్ మంతర్‌లోకి ప్రవేశించి జాతీయ జెండాతో నిరసన తెలిపిన సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. దీనికి వ్యతిరేకంగా సీజేపీ కన్నాట్స్ సెంట్రల్ పార్కులో శు క్రవారం సాయంత్రం 'లెహ్రా దో తిరంగా పేరిట ర్యాలీకి పిలుపునిచ్చింది. దీంతో శుక్రవారం ఉదయం నుంచే ఆ ప్రాంతాన్ని పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. సెంట్రల్ పార్కు నిరసనలకు అనుమతించిన వేదిక కాదని, ట్రాఫిక్, శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని పేర్కొంటూ అభిజీత్ దీప్సేకు రెండు వేర్వేరు నోటీసులు జారీ చేశారు. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు విధించారు. సాయంత్రం దీప్కే కన్నాటిన్కు బయలుదేరగానే అదువులోకి తీసుకున్నారు. అటు మండిహౌస్ నుంచి మార్చ్ ప్రారంభించిన ఐసా అధ్యక్షురాలు నేహా బోరాను కూడా అరెస్టు చేసి గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారు. నాయకులను నిర్బంధించి సెంట్రల్ పార్కు గేట్లకు తాళాలు వేసినప్పటికీ, నిరసనను పోలీసులు అడ్డుకోలేకపోయారు. సెంట్రల్ పార్కు చుట్టూ ఉన్న ఇన్నర్ సర్కిల్ రోడ్డు పైకి సామాన్యులతో పాటు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎస్ఐ, ఏఐఎస్‌పీ, డీవైఎఫ్ తదితర వామపక్ష విద్యార్థి సంఘాలు, ఆప్ శ్రేణులు వెల్లువెత్తాయి. ఆప్ నేత గోపాల్‌రాయ్ ఆధ్వర్యంలో 200 అడుగుల భారీ జాతీయ జెండాతో ర్యాలీ చేపట్టారు. వామపక్ష ఎంపీలు జాన్ బ్రిట్టాస్, వి. శివదాసన్, ఎ.ఎ. రహీం, సంతోష్ కుమార్ సైతం రోడ్లపైకి వచ్చారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, 'సర్'ను రద్దు చేయాలని నినదిస్తూ మార్చ్ కొనసాగించారు. సీజేపీ మీడియా ఇన్చార్జి విజయ్ ముల్లంగి, తదితరులు సెంట్రల్ పార్కు వద్దకు చేరుకుని జాతీయ జెండాలను ప్రదర్శించారు. కన్నాట్ ప్లేస్‌లోని పాలికా బజార్ సమీపంలోనూ నిరసనకారులు భారీగా గుమిగూడారు. ఢిల్లీ పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు మార్ను అడ్డుకునేందుకు భారీగా రంగంలోకి దిగాయి. జన్వథ్, కన్నాట్స్, మండిహౌస్ పరిసరాల్లో మొత్తం 150 మందికి పైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, సీజేపీ తిరంగా మార్ను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంపై ఇండియా కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత దేశంలో త్రివర్ణ పతాకాన్ని ఎగరేయకపోతే పాకిస్థాన్‌లో ఎగరేస్తామా? అని ఆప్ కన్వీనర్, మాజీ సీఎం కేజ్రివాల్ ప్రశ్నించారు. "స్వతంత్ర భారత్‌లో చేతిలో జాతీయ జెండా పట్టుకున్నందుకు యువతను జైల్లో పెడుతున్నారు.. అది అప్రకటిత ఎమర్జెన్సీ కాక మరేంటి? ప్రజాగళాన్ని నియంత్రించలేక మోదీ ప్రభుత్వం భయవడుతోంద"ని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, సీజేపీ శ్రేణులు ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో చేపట్టిన తిరంగా ర్యాలీకి అక్కడి పోలీసులు అనుమతినిచ్చారు.
సీజేపీ ఆందోళనలకు సల్మాన్ రష్టీ మద్దతు
భారత్‌లో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిర్వహిస్తున్న ఆందోళనలకు ప్రముఖ రచయిత సల్మాన్ రష్ఠీ, దర్శకురాలు మీరా నాయర్ మద్దతు ప్రకటించారు. న్యూయార్క్ నగరంలో గురువారం జరిగిన 'ఏషియన్ అమెరికన్ రైటర్స్ వర్రావు' విందు కార్యక్రమంలో వారు మాట్లాడారు. "భారత్‌లో ప్రస్తుతం ఏదో పెద్ద పరిణామం జరుగుతోంది.. దేశం అట్టుడుకుతోంది. ఈ పోరాటాలతో చాలా కాలం తర్వాత భారత యువత మనకు అత్యంత ఆకాజనకమైన క్షణాలను అందించింది. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ వేడుక చేసుకోవాల్సిందే" అని సల్మాన్ రద్దీ అన్నారు. దర్శకురాలు మీరా నాయర్ స్పందిస్తూ.. తనను 'కాక్రోచ్ అమ్మ'గా అభివర్ణించుకున్నారు.
ప్రభుత్వ మార్పు మా లక్ష్యం కాదు
ప్రశాంత్ భూషణ్, నేహా బోరా చేసిన వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు
జ్ఞానేశ్‌ను తొలగించాలన్నదే మా డిమాండ్: దీప్కే
సీఈసీకి వ్యతిరేకంగా తాము చేపట్టిన ఆందోళనను ప్రభుత్వ మార్పు కోసం జరుగుతున్న పోరాటంగా అభివర్ణించడాన్ని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తప్పుబట్టారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని మార్చడం, హింసను ప్రేరేపించడం తమ లక్ష్యం కాదని.. సీఈసీ జ్ఞానేశ్కుమార్న వదవి నుంచి తొలగించాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని చెప్పారు. ప్రభుత్వ మార్పే లక్ష్యమంటూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, బంగ్లాదేశ్ లో ప్రభుత్వాన్ని కూల్చిన తరహా జెన్ జీ ఉ ద్యమం నుంచి స్ఫూర్తి పొందామని విద్యార్థి సంఘం నాయకురాలు నేహా బోరా చేసిన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ "ప్రభుత్వాన్ని మార్చాలని మేం అనడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో చేయాలని కూడా కోరుకోవడం లేదు. సీఈసీ జ్ఞానేశ్‌ను తొలగించి.. నిష్పక్షపాతంగా వ్యవహరించే కొత్త సీఈసీని నియమించాలని మాత్రమే మేం కోరుతున్నాం”. అని చెప్పారు.