అతనికి ఆ ఫార్మాట్లో కూడా అవకాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్
న్యూజిలాండ్ తో జరిగిన రెండో టీ20లో అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించిన యువ సంచలనం తిలక్ వర్మపై టీమిండియా మాజీ కెప్టెన్, తెలంగాణ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ప్రశంసల వర్షం కురిపించారు. తిలర్ రేవలం పొట్టి ఫార్మాట్‌కి పరిమితం కాకుండా, టెస్టు క్రికెట్లోనూ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఒత్తిడిలో తిలక్ చూపిన పరిణతిని అయన ప్రత్యేకంగా అభినందించారు. న్యూజిలాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఒక దశలో భారత జట్టు ఓటమి అంచున నిలిచింది. కేవలం 70 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఈ క్లిష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ, నితీశ్ రెడ్డితో కలిసి అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. ముఖ్యంగా తిలక్ తన ఇన్నింగ్స్‌ను ఎంతో పరిణతితో నిర్మించాడు. అరంభంలో వికెట్ల పతనాన్ని అడ్డుకునేందుకు నెమ్మదిగా అడి. క్రీజులో కుదురుకున్న తర్వాత తన అసలు స్వరూపం చూపించాడు. 17 ఓవర్లు ముగిసేసరికి 13 బంతుల్లో 17 పరుగులు మాత్రమే చేసిన అతను, ఆ తర్వాత గేర్ మార్చాడు. చివరి ఓవర్లలో బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 26 బంతుల్లోనే 51 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికి నితీశ్ రెడ్డి (13 బంతుల్లో 26 నాటౌట్) చక్కటి సహకారం అందించడంతో భారత్ థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ అనంతరం న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడుతూ అజారుద్దీన్, తిలక్ ఆటతీరుపై సంతోషం వ్యక్తం చేశారు. "తిలక్ వర్మ ఒక అద్భుతమైన ఆటగాడు. అతను టెస్టు క్రికెట్ అదే అవకాశం రావాలని నేను ప్రార్థిస్తున్నాను. నా దృష్టిలో టెస్టు క్రికెట్టే అసలైన ఫార్మాట్, తిలర్ అందులోనూ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడని ఆశిస్తున్నాను. టీ20ల్లో ఇప్పటికే తన సత్తా చాటుతున్నాడు. ఈ రోజు భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు" అని అజారుద్దీన్ వివరించారు. క్రికెట్ అనేది ఒక జట్టు అట అని, ఈ విజయానికి జట్టు మొత్తం అభినందనలకు అర్హులని అజారుద్దీన్ పేర్కొన్నారు. టీమిండియాకు అంతా మంచే జరగాలని అయన ఆకాంక్షించారు. తొలి టీ20లో విఫలమైనప్పటికీ, రెండో మ్యాచ్‌లో ఒత్తిడిలో చూపిన ప్రదర్శనతో తిలక్ వర్మ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు.