సుప్రీంకోర్టుకు రాజకీయ ర్యాలీనా?
విపక్షాలపై సీజేఐ ధర్మాసనం ఆగ్రహం రాహుల్ గాంధీ,
ఖర్గే, అఖిలేష్ పాటు పలువురికి నోటీసులు
న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు ప్రాంగణంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిన నిరసన, పాదయాత్రపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. న్యాయవ్యవస్థను ఎవరూ భయపెట్టలేరని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం నిర్ణయాలను సవాలు చేస్తూ రాహుల్‌గాంధీ, ఇండియా కూటమి నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్, మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. పిటిషన్లపై నోటీసులు జారీ చేసినంత మాత్రాన రాజకీయ నాయకుల ప్రవర్తనను సమర్థించినట్లు కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ నాటికి వారి ప్రవర్తన ఎలా ఉంటుందో గమనిస్తామని పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రాంగణంలో రాజకీయ నిరసనలు నిర్వహిం చడంపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, న్యాయవాది గౌరవ్ భాటియా అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు రాజకీయ ఊరేగింపులతో తలమునకలవడం ఆమోదయోగ్యం కాడని, న్యాయస్థానం ప్రాంగణంలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకూడదని గౌరవ్ భాటియా పేర్కొన్నారు. నిరసనలు, పాదయాత్రల ద్వారా న్యాయస్థానంపై ఒత్తిడి తీసుకురావ డానికి ప్రయత్నిస్తున్నారని వాదించారు. ఈ సందర్భంగా న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. జయట వ్యక్తులు చేసే ప్రకటనలు, ఇతర ప్రయత్నాలను న్యాయస్థానం పట్టించు కోదని, జరుగుతున్న వరిణామాలన్నీ తమకు తెలుసునని వ్యాఖ్యానించారు. న్యాయస్థానంపై ఒత్తిడి తీసుకురావాలనే ప్రయత్నాలు బలహీనమైనవని పేర్కొన్నారు.
సీసీటీవీ దృశ్యాలు భద్రపరచండి..
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్)లో అవకతవకలు జరిగాయంటూ సుప్రీంకోర్టు వరకు పాదయాత్ర నిర్వహించిన వ్యవహారంలో రాహుల్‌గాంధీ, అఖిలేశ్ యాదవ్, ఇతర నేతల కు సంబంధించిన మరో పిటిషన్‌పైనా ధర్మాననం నోటీసులు జారీ చేసింది. ఇండియా కూటమి నిరసన సందర్భంగా సుప్రీం కోర్టు ప్రాంగణంలో నమోదైన సీసీటీవీ దృశ్యాలను భద్రపర చాలని ఆదేశించింది. సోమవారం రాహుల్‌గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి నేతలు పాదయాత్ర చేపట్టారు. సెంట్రల్ ఢిల్లీలోని బారాఖంబా రోడ్డు నుంచి ప్రారంభమైన ఈ మార్చ్ సుప్రీంకోర్టు వద్ద ముగిసింది. ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. ఈ ఘట నపై తాజాగా విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తన అభ్యం తరాలను వ్యక్తం చేసింది. అంతకుముందు, ఎన్బఆర్ ప్రక్రియ. ఎన్నికల సంఘం పనితీరుకు సంబంధించిన సమస్యలపై చర్చించడానికి అపాయింటీమెంట్ ఇవ్వాలన్న రాహుల్ అభ్యర్థ నను సీజేఐ సూర్యకాంత్ తిరస్కరించారు. లేవనెత్తాలనుకున్న సమస్యలు ఇప్పటికే సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంటూ సీజేఐ.. ఆయన అభ్యర్ధనను తిరస్కరించారు. ప్రభుత్వ పరిపాలనాపరమైన పనితీరులో కోర్టు జోక్యం చేసుకోలేదని, అయితే తగిన ఉ వశమనం కోసం నాయకులు న్యాయవరమైన విషయాలలో కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ ఉందని ఆయన స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియను సవాలు చేస్తూ లోక్‌సభలో ప్రతివక్షనేత రాహుల్ గాంధీ, ఇండియా కూటమికి చెందిన ఇతర నేతలు దాఖలు చేసిన పిటిషన్ పై భారత ఎన్నికల సంఘానికి (ఈసీఐ) సుప్రీంకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది.