పిచ్ స్వభావం, మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా కచ్చితమైన లైన్, లెంగ్త్ బౌలింగ్ చేయడమే తన విజయ రహస్యమని భారత యువ పేసర్ అన్షుల్ కాంబోజ్ తెలిపాడు. బౌలింగ్‌లో క్రమశిక్షణ పాటించడం, పరిస్థితులను త్వరగా అంచనా వేసి సరైన ప్రదేశాల్లో బంతులు వేయడంపై దృష్టి పెడుతున్నానని చెప్పాడు. న్యూజిలాండ్ జరుగుతున్న వన్డే సిరీస్ లో తన ప్రదర్శనకు ఇదే కారణమని వివరించాడు. క్రికెట్లో తన ఎదుగుదల గురించి మాట్లాడుతూ.. 13 ఏళ్ల వయసులో ఆట ప్రారంభించినట్లు కాంబోజ్ తెలిపాడు. హర్యానా తరఫున అడిన అనుభవం తనకు పయోగపడుతోందన్నాడు. అక్కడి వాతావరణం, పిచ్‌లకు న్యూజిలాండ్ లోని పరిస్థితుల్లో కొంత పోలిక ఉండటంతో ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడటం సులువైందని పేర్కొన్నాడు. సిరీస్‌లో భాగంగా హామిల్టన్ లోని సెడ్డన్ పార్క్ జరగాల్సిన మూడో వన్డేకు ముందు అతడు ఈ విషయాలు వెల్లడించాడు. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతో తన కల నిజమైందని కాంబోజ్ చెప్పాడు. దేశం తరఫున ఆడాలని ప్రతి క్రికెటర్ కలలు కంటాడని, జాతీయ జట్టులో చోటు దక్కడం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందని తెలిపాడు.
చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన అనుభవం కూడా తనకు ఎంతో నేర్పిందని చెప్పాడు. మహేంద్ర సింగ్ ధోనీ, ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మార్గదర్శకత్వంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని వెల్లడించాడు. ఫలితాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా మైదానంలో తన బాధ్యతలపై దృష్టి పెడుతున్నట్లు తెలిపాడు. ఆటను మెరుగుపరుచుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నానని వివరించాడు. న్యూజిలాండ్ పరిస్థితులకు అలవాటు పడటంలో వాతావరణం, పిల్లను అర్థం చేసుకోవడం కీలకమని కాంబోజ్ తెలిపాడు. భారత్-ఏ సిరీస్ సమయంలో ఇక్కడి వాతావరణానికి అలవాటు పడటంతో పాటు ఏ ప్రాంతాల్లో బంతులు వేయాలనే విషయంపై దృష్టి పెట్టినట్లు చెప్పాడు. ఇక్కడి పిచ్‌లు కొంత చల్లగా, వేగంగా స్పందించే స్వభావంతో ఉన్నాయని పేర్కొన్నాడు. బౌలింగ్‌ను అనవసరంగా సంక్లిష్టం చేసుకోకుండా సరళమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నానని కాంబోజ్ తెలిపాడు. పిచ్, మ్యాచ్ పరిస్థితులను బట్టి సరైన లైన్, లెంగ్తో బంతులు వేయడమే తన ప్రాధాన్యమని స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఈ విధానం తనకు మంచి ఫలితాలనిస్తోందని చెప్పాడు