బ్యాటింగ్ కోచ్ సితాన్టు కోటక్ ఆసక్తికర వ్యాఖ్యలు!
టీమిండియా సీనియర్ పేనర్ భువనేశ్వర్ కుమార్ నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ భారత టీ20 జట్టులోకి పచ్చాడు. అతడి పునరాగమనానికి ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనతో పాటు అపార అనుభవం కూడా కారణమని భారత జట్టు బ్యాటింగ్ కోచ్ సితాస్తు కోటక్ వెల్లడించాడు. యువ బౌలర్లు బాగా రాణిస్తున్నప్పటికీ, కీలక సమయాల్లో అనుభవం కూడా అవసరమని అభిప్రాయపడ్డాడు. భువనేశ్వర్ కుమార్ చివరిసారిగా 2022 నవంబర్‌లో న్యూజిలాంద్ తో జరిగిన సిరీస్‌లోలో భారత్ తరఫున ఆడాడు. ఆ తర్వాత జాతీయ జట్టుకు దూరమైన అతడు.. ఐపీఎల్లో మాత్రం తన సత్తా చాటాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతూ 2025 సీజన్లో 17 వికెట్లు, 2026 సీజన్లో 28 వికెట్లు పడగొట్టాడు. రెండు సీజన్లలో కలిపి 15 వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆ రెండు సీజన్లలో ఆర్సబీ పరునగా ఐపీఎల్ టైటిళ్లు గెలుచుకుంది. ఇంగ్లండ్ పర్యటన సమయంలో జస్ప్రీత్ బుహ్ర అందుబాటులో లేకపోవడం, యుప బౌలర్లు ఎక్కువగా ఉండటంతో అనుభవజ్ఞుల అవసరం కనిపించిందని కోటక్ చెప్పాడు. యువ ఆటగాళ్లు బాగా ఆడుతూ జట్టులోకి వస్తున్నారని, అయితే కొన్ని సందర్భాల్లో అనుభవానికి కూడా ప్రాధాన్యం ఉంటుందని వివరించాడు. ఐపీఎల్లో భూపనేశ్వర్ నిలకడగా రాణించడం కూడా అతడి ఎంపికకు కారణమై ఉండొచ్చని పేర్కొన్నాడు. మరో సీనియర్ పేనర్ మహమ్మద్ షమీ పునరాగమనంపై మాత్రం కోటక్ స్పష్టమైన వ్యాఖ్యలు చేయలేదు. షమీ కూడా మ్యాచ్‌లు ఆడుతూ బాగా రాణిస్తున్నాడని, అతడి ప్రదర్శనతో పాటు జట్టు అవసరాలను పరిగణనలోకి తీసుకుని సెలెక్టర్లు నిర్ణయం తీసుకుంటారని చెప్పాడు. తాను సెలెక్టర్‌ను కానందున షమీ ఎంపికపై తుది నిర్ణయం చెప్పలేనని స్పష్టం చేశాడు. వీవీఎస్ లక్ష్మణ్‌ను సెలక్షన్ సమావేశాల్లో భాగం చేయడం, జట్టు యాజమాన్యం నుంచి సెలెక్టర్లకు ఆటగాళ్ల గాయాల సమాచారాన్ని చేరవేసే బాధ్యత అప్పగించారన్న వార్తలపైనా కోటక్ స్పందించాడు. ఈ విషయం తనకు కూడా మీడియా ద్వారానే తెలిసిందని చెప్పాడు. బీసీసీఐ తీసుకున్న నిర్ణయం వెనుక సరైన కారణం ఉంటుందని భావిస్తున్నానని తెలిపాడు.